తెలుగు ఇండస్ట్రీపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. హీరోయిన్లకు పెళ్లయితే | Kajal Aggarwal Comments On South Cinema Industry | Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: నిష్టూరమైన నిజాలు మాట్లాడిన స్టార్ హీరోయిన్

Published Wed, Jun 5 2024 7:21 AM | Last Updated on Wed, Jun 5 2024 8:36 AM

Kajal Aggarwal Comments On South Cinema Industry

దక్షిణాదిలో హీరోయిన్లగా పేరు తెచ్చుకుని.. ఆ తర్వాత ఛాన్సులు రాకపోతే నిందలు వేయడం పరిపాటే. గతంలో ఇలియానా, తాప్సీ, పూజా హెగ్డే ఇలానే చేయగా, ఇప్పుడు ఆ లిస్టులోకి హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేరింది. 'లక్ష్మీ కల్యాణం' అనే తెలుగు మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. 'మగధీర' ఈమె ఫేట్ మార్చింది. స్టార్ హీరోయిన్‌ని చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?)

2020లో ముంబయికి చెందిన గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ మగబిడ్డ జన్మించాడు. పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న కాజల్‌కి ఛాన్సులు తగ్గిన మాట వాస్తవమే. జూన్ 7న 'సత్యభామ' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. సౌత్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

'బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీ మధ్య చాలా తేడా ఉంది. దక్షిణాదిలో పెళ్లయిన హీరోయిన్లని బాగా లేరని పక్కన పెట్టేస్తారు. అదే హిందీలో మాత్రం పెళ్లయినా సరే హీరోయిన్లుగా నటిస్తుంటారు. షర్మిళా ఠాకుర్, హేమమాలిని మొదలుకొని దీపికా పదుకొణె, ఆలియా భట్ లాంటి వాళ్లకు హీరోయిన్లుగా అవకాశాలు వస్తున్నాయి. కానీ దక్షిణాదిలో అలాంటి పరిస్థితి లేదు. దీనికి నయనతార అతీతం. ఆమె మంచి సినిమాలు చేస్తోంది. కాగా దక్షిణాదిలో నెలకొన్న ఈ పరిస్థితిని త్వరలో మారుద్దాం' అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. 

(ఇదీ చదవండి: డబ్బుల కోసం అడల్ట్ సినిమాలు చేశా: 'పంచాయత్' నటుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement