
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. గతేడాది గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్‌ను కూడా పక్కా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో ‘ఆచార్య’, కమల్ హాసన్‌తో ‘ఇండియన్-2’లో నటిస్తుంది ఈ భామ. అయితే ఈ అమ్మడి కెరీర్ పీక్‌లో ఉండగానే భర్త గౌతమ్ కిచ్లు, చెల్లి నిషా అగర్వాల్‌ని సైతం టాలీవుడ్‌కి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలెట్టిందట.
ఇప్పటికే చెల్లెలు నిషా అగర్వాల్ గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే అవి ఆమె కెరీర్‌కు ఏ మాత్రం ప్లస్ కాలేదు. దీంతో పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైన నిషా ఇప్పుడు రీఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తుంది. రానా, వెంకటేష్‌లో కలిసి నటించనున్న ఓ వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర కోసం నిషాను ఇప్పటికే ఎంపిక చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. దీని వెనుక కాజల్ గట్టి ప్రయత్నాలే చేసిందట. మొత్తానికి త్వరలోనే చెల్లి నిషా, భర్త గౌతమ్‌లను తెలుగు తెరకు పరిచయం చేసేందుకు కాజల్ సన్నాహాలు చేస్తుందట.
చదవండి : ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా అని కన్నీరు పెట్టుకున్నా: శ్రీముఖి
క్యూట్‌గా నవ్వులు చిందిస్తున్న ఈ కవలలు ఎవరో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment