స్టేజీపై బతుకమ్మ ఆడిన కాజల్‌, శ్రీలీల.. వీడియో వైరల్‌ | Kajal Aggarwal And Sreeleela Plays Bathukamma In Bhagavanth Kesari Trailer Launch Event, Video Viral - Sakshi
Sakshi News home page

Kajal-Sreeleela Viral Video: బతుకమ్మ ఆడిన హీరోయిన్స్‌.. నెట్టింట వీడియో వైరల్‌

Oct 9 2023 1:29 PM | Updated on Oct 9 2023 2:39 PM

Kajal Aggarwal, Sreeleela Plays Bathukamma in Hanamkonda - Sakshi

తెలుగమ్మాయిలా కట్టూబొట్టుతో మెరవడమే కాక ఎంతో ముచ్చటగా బతుకమ్మ ఆడగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తెలంగాణ అస్థిత్వాన్ని తెలిపే పూలపండుగ బతుకమ్మ. తొమ్మిది రోజులపాటు ఈ వేడుక ఘనంగా జరుపుకుంటారు. భాద్రపద అమావాస్య నాడు మొదలయ్యే బతుకమ్మ అష్టమి రోజున సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మతో ముగుస్తుంది. అయితే ఈసారి బతుకమ్మ పండగ కాస్త ముందుగానే మొదలైంది. ఆదివారం నాడు హనుమకొండలో హీరోయిన్స్‌ కాజల్‌ అగర్వాల్‌, శ్రీలీల బతుకమ్మ ఆడారు.

నందమూరి బాలకృష్ణ సినిమా భగవంత్‌ కేసరి ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ బతుకమ్మను ఎత్తుకుని స్టేజీ మీదకు వెళ్లి ఆడిపాడారు. తెలుగమ్మాయిలా కట్టూబొట్టుతో మెరవడమే కాక ఎంతో ముచ్చటగా బతుకమ్మ ఆడగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

భగవంత్‌ కేసరి సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీలో బాలకృష్ణ, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. శ్రీలీల ముఖ్య పాత్రలో నటించగా బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ విలన్‌గా కనిపించనున్నాడు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చదవండి: 300కు పైగా చిత్రాలు.. తన పేరునే మర్చిపోయి.. కదల్లేనిస్థితిలో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement