కన్నడ నటుడు రఘు రామప్ప ఓ ఇంటివాడయ్యాడు. ప్రేయసి అశ్వినితో ఏడడుగులు నడిచాడు. ఇరు కుటుంబాలు సహా బంధుమిత్రుల సమక్షంలో శుక్రవారం బెంగళూరులో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను రఘు రామప్ప సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
తన పెళ్లి గురించి ఆయన మాట్లాడుతూ.. 'మాది ప్రేమ వివాహం.. కాకపోతే పెద్దల అంగీకారంతో ఇద్దరం ఒక్కటయ్యాం. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఐదేళ్ల క్రితం మేము కలుసుకున్నాం. అప్పుడే మా మధ్య ప్రేమ చిగురించింది. మా పెళ్లి ఎప్పుడో జరగాల్సింది. కానీ సడన్‌గా కోవిడ్ రావడంతో మా ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి. వివాహం వాయిదా పడింది. మా నాన్నకు ప్రకృతి అంటే ప్రాణం. అందుకని శివమొగ్గలోని ప్రైవేట్ ఫారెస్ట్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్నాం.
అయితే అడవిలోకి రావడం అందరికీ సాధ్యపడదు, అతిథులకు కష్టమవుతుందేమోనని ఆలోచించి బెంగళూరులోనే మండపం ఫిక్స్ చేశాం. ఇప్పుడే పెళ్లయింది కాబట్టి ఈ వారమంతా గుళ్లూగోపురాలు తిరిగేస్తాం. ఆ తర్వాత హనీమూన్ గురించి ప్లాన్ చేస్తాం. నాకు చారిత్రక ప్రదేశాలంటే చాలా ఇష్టం. కాబట్టి అలాంటి ప్రదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నా' అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే రఘు రామప్ప నటుడు మాత్రమే కాదు ఫిట్‌నెస్ కోచ్ కూడా! అతడు బాడీ బిల్డర్‌గా జాతీయస్థాయిలోనూ సత్తా చాటాడు.
చదవండి: రూ.132 కోట్లు పోయాయి, దిగులుతో భర్త కోమాలోకి: కన్నీటిపర్యంతమైన నటి
Comments
Please login to add a commentAdd a comment