
బెంగళూరు: రచయిత, కన్నడ బిగ్‌బాస్ కంటెస్టెంట్ చైత్ర కోటూర్ ఆత్మహత్యకు యత్నించడం సంచలనం రేపుతోంది. గురువారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో ఆమె సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కన్నడ బిగ్‌బాస్ 8వ సీజన్‌లో పాల్గొన్న చైత్ర కోటూర్ ఎందరో అభిమానులను సంపాదించుకుంది. 'ఒందు దిన ఒందు క్షణ' సినిమాతో సినిమాల్లో అడుగు పెట్టిన చైత్ర 'లగ్న పత్రిక' అనే సీరియల్లో కూడా నటించింది. ఈ ఏడాది మార్చి 28న నాగార్జునతో గుట్టుచప్పుడు కాకుండా గుడిలో వివాహం చేసుకుంది. ఆమె పెళ్లి విషయం ఇరు కుటుంబ సభ్యులను షాక్‌కు గురి చేసింది. అయితే అబ్బాయిని బలవంతంగా పెళ్లికి ఒప్పించారని ఆ మధ్య వివాదం నడిచింది. ఇంతలోనే చైత్ర ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై ఆమె కుటుంబసభ్యులు పెదవి విప్పకపోగా, తమ కూతురు ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని కోరారు.
చదవండి: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద ఐకాన్ స్టార్ బర్త్‌డే వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment