కార్తీకదీపం ఫేం దీప(ప్రేమి విశ్వానాథ్) తెలుగు బుల్లితెర ప్రేక్షకులుకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వంటలక్కగా పాపులర్ అయిన ఆమె చీరకట్టులో అనుకువ, సహనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కార్తీకదీపం ట్వీస్ట్‌లతో సాగుతున్న సంగతి తెలిసిందే. కార్తీక్, మోనితల రిజిస్టర్ మ్యారేజ్ గురించి ఉత్కంఠం సాగుతున్న ఈ సీరియల్‌ను డైరెక్టర్ ఎలా మలుపు తిప్పబోతున్నాడనేది ఎవరి ఊహాకు అందడం లేదు. దీంతో కొంతమంది ‘కార్తీక్, మోనిత పెళ్లి అయిపోతుంది, ఆ తర్వాత వంటలక్క వెళ్లిపోతుంది.. వెంటనే కార్తీకదీపంకు శభం కార్డు’ అంటూ చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ప్రేమి విశ్వనాథ్ నటిగా ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లు అవుతున్న ఆమె ఇంతవరకు వేరే సీరియల్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ మాలయాళ సీరియల్‌కు సంతకం చేసింది. ప్రేమి లీడ్ రోల్‌లో దేవికా అనే సీరియల్ ప్రాసారం కాబోతుంది. ఈ సీరియల్‌కు సంబంధించిన ప్రోమోను ఆమె తన ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఇందులో వంటలక్క సరికొత్త లుక్‌లో దర్శనం ఇచ్చింది. మోడ్రన్ డ్రెస్‌లో స్టైలిష్ లుక్‌తో అందరికి షాక్ ఇచ్చింది.
ఈ సీరియల్ పేరు దేవికా అని, సోమవరం (జూలై 5) నుంచి రాత్రి 8 గంటలకు సూర్య టీవీ ప్రసారం అవుతున్నట్లు ఈ ప్రమోలో ప్రేమి వెల్లడించింది. కార్తీకదీపంలో చాలా పద్దతిగా, సంప్రదాయం ఉన్న వంటలక్కను ఇలా చూసి ఆమె అభిమానులంతా షాక్ అవుతున్నారు. ఈ ప్రోమో చూస్తుంటే ప్రేమి విశ్వనాథ్‌లో ఇందులో పోగరు ఉన్న సంపన్నురాలిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు బాష అర్థంకాకపోయిన వంటలక్క కోసం సీరియల్ చూసేందుకు అసక్తిచూపుతున్నారట.
Comments
Please login to add a commentAdd a comment