కార్తీకదీపం జూన్ 21వ ఎపిసోడ్.. సౌందర్యని కలవడానికి వెళ్లిన దీప.. తిరిగి రావడం, కార్తీక్ తింటూ రా దీపా.. నీకు ఇడ్లీ తీసిపెట్టాను అని చెప్పడంతో.. మరి నాకు అంటూ మోనిత ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. నవ్వుతూ.. లోపలికి వచ్చి.. టిఫిన్ తింటాను అంటూ కూర్చుంటుంది. అంతేగాక దీపను కూడా తిను అని అడగడంతో.. ఇప్పుడు తినను తర్వాత తర్వాత తింటానని దీప సమాధానం ఇస్తుంది. వెంటనే మోనిత ‘చెప్పాను కదా దీప నీలాగా నేను వేయిట్ చేయలేను’ అంటూ పిల్లలకు అర్థం కాకుండా తెలివిగా మాట్లాడుతుంది.
ఇండ్లీ పెట్టుకుని ‘కార్తీక్ ఇడ్లీ సూపర్ నీ చేతుల్లానే భలే మెత్తగా ఉంది’ అని మాట్లాడుతూ దీప ఉడుక్కునేలా చేస్తుంది. ఆ తర్వాత ఈ మధ్య కాస్త నీరసంగా ఉంటోంది, అందుకే టైమ్‌కి తింటున్నాను. లేకపోతే కళ్లు తిరుగుతున్నాయి. ఈ మధ్య వికారంగా ఉంటోందంటూ తన మాటలతో కార్తీక్‌ను, దీపను ఇబ్బంది పెడుతుంది మోనిత. ఇక హిమ, శౌర్యలకు తెచ్చిన చాక్లెట్స్ బ్యాగులోంచి తీసి మనపిల్లలే కదా అని తీసుకొచ్చాను అంటుంది. ఇక మోనిత తీరు చూసి కార్తీక్ మనసులో ‘నాకు తెలిసి నేను ఎప్పుడూ ఏ తప్పు చెయ్యలేదు.. గిల్టీగా ఫీల్ కాలేదు.. అందుకే నాకు తల దించుకోవడం అలవాటు లేదు.. ఇప్పుడు అర్థమవుతుంది చెయ్యని నేరానికి దీప పాపం ఎంత నరకం అనుభవించుంటుంది?’ అనుకుంటాడు బాధగా. పిల్లలను బయటకు వెళ్లమని చెప్పి మోనిత గోడ మీద గీసిన 10 గీతల్లో రెండో గీత కొట్టేసి వెళ్లిపోతుంది.
ఇక సౌందర్య ఇంటికి వెళ్లి పరువు గురించి, దీప జీవితం గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. శ్రావ్య కూల్ చేసే ప్రయత్నం చేస్తే.. శ్రావ్యతో కూడా అదే బాధను పంచుకుని బాధపడుతుంది. ఇదిలా ఉండగా ఇంటికి వెళ్లిన మోనిత అద్దంలో చూసుకుంటూ దీప తనకంటే అందంలో, చదువులో, డబ్బు సంపాదనలో ఎందులో ఎక్కవ కాదు మరేందుకు కార్తీక్ దీపనే ఇష్టపడుతున్నాడని ప్రియమణిని అడుగుతుంది. ప్రియమణి అన్నింట్లోనూ మీరే ఎక్కువ అంటూనే మోనితకు కౌంటర్ వేస్తుంది. మోనిత చేతిని తీసి ఆమె గుండెల మీద పెట్టి.. ‘ఇప్పుడు చెప్పండమ్మా.. దీపమ్మ మంచిదా.? మీరు మంచివారా’ అంటుంది. దాంతో మోనితకి తను చేసిన నేరాలన్నీ గుర్తొస్తాయి.
మీ కళ్లలోనే తెలుసిపోతుందమ్మా.. మీరు మంచివారైతే కార్తీక్ అయ్యే మీ దగ్గరకు వస్తాడని సలహా ఇచ్చి వెళ్లిపోతుంది. అయితే మోనిత మాత్రం మనసులో.. ‘ఎవరు ఎన్ని చెప్పినా నేను చెయ్యాల్సింది నేను చేస్తాను’ అనుకుంటుంది. ఇదిలా ఉండగా దీప దగ్గరకు వారణాసి కంగారు వస్తూ అక్కా.. డాక్టర్ మోనిత ఇక్కడికి వచ్చి వెళ్లిందా?’ అని అడుగుతాడు. దీంతో ఏం అయ్యిందని దీప అడగ్గా.. మోనిత తనని తమ్ముడని పిలిచిందని, నిన్ను బాగా చూసుకోమ్మని ఇక నుంచి ఏ కష్టం వచ్చినా నువ్వే చూసుకోవాలని అన్నదని చెబుతాడు.అదంతా విన్న కార్తీక్ అక్కడి రాగానే వారణాసి వెళ్లిపోతాడు.
ఇక కార్తీక్ దీప వంక జాలిగా చూస్తూ దీపకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నస్తాడు. ఇంతలో పిల్లలు వాళ్లిదరికీ ఫోటోస్ తీసి.. ‘సూపర్ నాన్నా.. సూపర్ డాడీ.. మీరు ఇలా కలిసి ఉంటేనే మాకు చాలా ఇష్టం.. ఇంతకన్నా మాకు ఏం అవసరం లేదు’ అంటారు. తరువాయి భాగంలో కార్తీక్ అసలు ఏం జరిగిందనేది ఏడుస్తూ చెపుతాడు. తనకు పిల్లలు పుట్టరని మోనిత చెప్పిందనే విషయంతో పాటు ఆరోజు రాత్రి మోనిత ఇంట్లోనే ఫుల్‌గా తాగి పడిపోయిన విషయం చెబుతాడు. ఆ మైకంలో ఏం జరిగిందో కూడా తనకు తెలియదని ఈ విషయం మోనిత తనకు చెప్పేవరకు తెలియదని కార్తీక్ దీపకు వివరిస్తాడు. దీంతో దీప ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం.
చదవండి:
‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్: ఫొటో షేర్ చేసిన రామ్ చరణ్
Comments
Please login to add a commentAdd a comment