కార్తీకదీపం జూన్ 24వ ఎపిసోడ్: తమ మధ్య తప్పు జరిగిందని మోనిత చెప్పేవరకు తనకు తెలియదని కార్తీక్ వివరించడంతో దీప ఆలోచనలో పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మోనిత కార్తీక్‌కు పెట్టిన గడువు రెండు రోజుల్లో పూర్తైయిపోతుందని, ఎల్లుండి ఈ టైంకి ఏం జరుగుతుందో ఊహించుకుంటుంటే ఒళ్లు పులకరిస్తుందంటూ మురిసిపోతుంది. అంతేగాక తనని తిట్టిన దీప, సౌందర్యల నోళ్లు ఈ దెబ్బకు మూతపడతాయని తెగ సంబరపడిపోతూ ప్రియమణిని పిలిచి వేడి నీళ్లు తీసుకురమ్మని చెబుతుంది.
ఇదిలా ఉంగా భాగ్యం మురళీ కృష్ణతో దీప ఇంటికి వెళ్లోస్తానని చెబుతుంది. ఎందుకని అడగ్గా దీపను ఇంటికి తీసుకువచ్చేస్తానని, అది డాక్టర్ బాబుతో ఉండేలా కనిపించడంలేదంటుంది. అంతేగాక ఇక దీప కష్టాలు పడింది చాలు ఇకనైనా దాని కష్టాలను దూరం చేద్దామని అనడంతో దీప గురించి భాగ్యం అంతగా ఆలోచించడం చూసి మురళీ కృష్ణ ఆనందపడిపోతాడు. మరోవైపు మోనిత కార్తీక్‌కు ఫోన్ చేస్తూనే ఉంటుంది. అయినా కార్తీక్ లిఫ్ట్ చేయడు. అలా దాదాపు మోనితవి 25కు పైగా మిస్‌డ్ కాల్స్ ఉండటం చూస్తాడు కార్తీక్.
దీంతో ఆలోచనలో పడతాడు. మోనిత ఏంటీ ఇన్నిస్లార్లు కాల్ చేస్తుందని, ఏం మాట్లాడాలి. ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే ఏమైన రచ్చ చేస్తుందా అంటూ ఆలోచిస్తుండగా శౌర్య అప్పడే వస్తుంది. నాన్న.. నాన్న అని ఎన్నిసార్లు పలిచిన కార్తీక్ పలకడు. దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. మరోవైపు దీప కూడా అంతే తీవ్ర ఆలోచనలో పడుతుంది. డాక్టర్ బాబు మీద తను పెట్టుకున్న నమ్మకానికి ఎందుకింత ఎదురు దెబ్బ తగిలిందని, మోనిత ఎంత జానతనం చూపించిన ఆయన చలించడని గట్టిగా నమ్మాను.. అయినా ఈ తప్పు ఎలా జరిగిందని ఆలోచిస్తుండగా మధ్యలో హిమ వచ్చి అమ్మ అని ఎన్నిసార్లు పిలిచిన పలకకపోవడంలో అక్కడి నుంచి హిమ వెళ్లిపోతుంది.
ఇక ఇందులో మోనిత కుట్ర ఏదో ఉందని అది ఎలా తెలుస్తుందంటూ ఆలోచిస్తూ దీప ప్రియమణిని నిలిదీస్తే చెబుతుందా? అని అనుకుంటుంది. చెప్పదు.. మరి ఏం జరిగింది అన్నది ఎలా తెలుస్తుందని మదనపడుతుంది దీప. ఇక కార్తీక్ తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోనిత రగిలిపోతుంది. తనని అవాయిడ్ చేస్తున్నాడా? ఇంత చెప్పిన కార్తీక్ తన మాటలను చెవికి ఎక్కించుకోవడం లేదని మండిపోడుతుంది. ఇంకా దీపనే కోరుకుంటే ఆ తర్వాత తను చేసేది చూసి బుర్ర తిరగడమే కాదు.. తనే నా చుట్టు తిరిగేలా చేస్తా అనుకుంటూ క్యాలెండర్‌లో 25 తారీఖుని స్కెచ్‌తో మార్క్ చేస్తుంది.
ఆ తర్వాత ప్రియమణి వచ్చి ఈ సున్నా ఏంటని అడగ్గా.. ఇది సున్నా కాదే వెర్రి మొహమా.. సునామీ.. ఆ రోజు తను క్రియేట్ చెయ్యబోయే సునామీ అని సమాధానం ఇస్తుంది. మరోవైపు సౌందర్య కూడా దీప, కార్తీక్‌ల గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా.. మోనిత చీర కట్టుకుని ఇంటికి వస్తుంది. లోపలికి అడుగు పెట్టగానే అత్త ఎదురైందంటే మంచి శకునమే అంటూ నమస్తే ఆంటీ అంటూ లోపలికి వెళుతుంది. సౌందర్యతో తనకు న్యాయం చేయమని, కార్తీక్ తననుంచి మొహం చాటేస్తున్నాడని చెబుతూ, సాటి స్త్రీగా తన దరపున పోరాడాల్సిన సమయం వచ్చింది ఆంటీ అంటూ సౌందర్య దగ్గర అమాయకంగా నటిస్తుంది మోనిత.
దీంతో సౌందర్య అవును పోరాడే సమయం వచ్చందని, కార్తీక్ తనతో ఓ మాట చెప్పడంటూ సౌందర్య మోనితలో కంగారు పుట్టిస్తుంది. దీంతో అదేంటని భయంగా అడగడంతో మోనిత వంక సౌందర్య అనమానంగా చూస్తుంది. అదేం లేదని నువ్వు కంగారు పడకు అంటూ శ్రావ్యను పిలిచి మోనితకు జ్యూస్ తీసుకురమ్మని చెబుతుంది సౌందర్య. వెంటనే శ్రావ్య అయ్యో.. కడుపుతో ఉన్నానంటుంది కదా అత్తయ్యా.. ఏ పుల్ల మామిడి కాయలో, చింతకాయ ఏమైనా అడుగుతుందేమో అని వెటకారంగా అంటుంది. ‘అంత వికారంగా ఏం కనిపించడటం లేదులే.. జ్యూస్ చాల్లే’ అని అంతే వెటకారంగా అంటుంది సౌందర్య. ఏం చెప్పి ఉంటాడు కార్తీక్.. ఈవిడేంటీ? ఏ మాత్రం తొణక్కుండా ఉంది’ అని మోనిత మాత్రం చేతులు నలిపేసుకుంటూ కంగారుపడుతుంది.
మరోవైపు దీప కార్తీక్‌లు కూర్చుని ఉండగా.. నిన్ను ఇలా ఎదురుగా కూర్చోబెట్టుకోవడానికి ఎంతసేపు బతిమలాడాల్సి వచ్చిందో.. నా పరిస్థితి ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు దీపని కార్తీక్ అంటాడు. అంతేగాక నీ మౌనాన్ని భరించలేకపోతున్నానని, నాతో మాట్లాడు దీపని కార్తీక్ వేడుకుంటాడు. దీంతో దీప చెప్పండి డాక్టర్ బాబు.. మీరే నాతో మళ్లీ ఏదో చెబుతానంటున్నారు.. విన్నదే అయితే వినడం ఎందుకు? ఉన్నదే అయితే చెప్పడం దేనికీ?’ అంటుంది దీప. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment