గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రవితేజ హిట్ సినిమా నటి | Kick Movie Ileana Sister Name Present Pic And Full Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: అప్పట్లో తెలుగు సినిమాల్లో.. ఇప్పుడేమో ఫ్యామిలీతో బిజీగా

Published Fri, Jul 19 2024 12:56 PM | Last Updated on Fri, Jul 19 2024 1:39 PM

Kick Movie Ileana Sister Name Present Pic And Full Details

టాలీవుడ్ పెద్ద సముద్రం లాంటిది. ఎంతమంది కొత్త యాక్టర్స్ వచ్చినా సరే అవకాశాలు దక్కుతాయి. అయితే వాటిని నిలబెట్టుకునేందుకు మాత్రం కష్టపడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు స్టార్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికీ ఊహించని విధంగా కనుమరుగవుతుంటారు. రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించిన ఈ బ్యూటీని గుర్తుపట్టారా? లేదంటే ఆమె ఎవరో మమ్మల్నే చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: బాలీవుడ్ మాఫియాకి దెబ్బ మీద దెబ్బ.. షాకిచ్చిన 'కల్కి' మేకర్స్!)

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ఆషికా బతిజా. ఇలా చెబితే గుర్తురాకపోవచ్చు. 'కిక్' సినిమాలో ఇలియానాకు చెల్లెలు అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ఈమె గురించి పెద్దగా వివరాలేం సోషల్ మీడియాలో లేవు. కాకపోతే తెలుగులో 'కిక్'లో చేసిన తర్వాత మంచి గుర్తింపు వచ్చింది. కానీ తర్వాత అవకాశాలు రాలేదో ఏమో గానీ పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయింది. మన దేశానికి చెందిన బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది.

గతేడాది ఈమెకు ఆషికాకు పాప కూడా పుట్టింది. ఈమె ఇన్ స్టా ప్రొఫైల్ చూస్తే ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. కూతురు చిన్నపిల్ల కాబట్టి ప్రస్తుతానికి సినిమాలపై పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చు. కానీ మోడర్న్ పిక్స్ చూస్తుంటే మాత్రం ఇంకా ఈమెకు యాక్టింగ్‌పై ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తుంది. మరి భవిష్యత్త్‌లో టాలీవుడ్‌లో ఛాన్సుల కోసం మళ్లీ ట్రై చేస్తుందేమో?

(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement