కొన్ని సినిమాలకు ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చెరిగిపోని స్థానం ఉంటుంది.అలాంటి స్థానాన్ని సంపాదించుకున్న సినిమానే "రాజావారు రాణిగారు". కిరణ్ అబ్బవరం హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చి నేటికి మూడేళ్లు అయింది. సినిమాను ఇప్పుడు చూసినా ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ఇక సినిమా విషయానికి వస్తే రాజా (కిరణ్ అబ్బవరపు) అనే కుర్రాడు రాణి (రహస్య గోరక్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ తన ప్రేమను రాణితో చెప్పడానికి లోలోపల ఒక రకమైన భయంతో ఉంటాడు. తన ప్రేమను రాణితో చెప్పే సమయానికి ఆమె ఊరు విడిచి వెళ్ళిపోతుంది. రాజా తన ప్రేమను ఎలా నిలబెట్టుకున్నాడు? అనేదే మిగతా కథ.
రవికిరణ్ కోలా ఒక మాములు కథను తీసుకుని మనసుకి హత్తుకునేలా తీశాడు. మనం మర్చిపోలేని అనుభూతులను ఒక మూటలా కట్టి వెండితెరపై పరిచేసాడు. ఈ సినిమాలో రాజా పాత్రలో నటించిన "కిరణ్ అబ్బవరం" మనలో ఒకడిలా అనిపిస్తాడు. తన మొదటి సినిమాతోనే సరైన సక్సెస్ అందుకున్న కిరణ్, ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. సినిమాకి కొత్త పాత లేదు మంచిగా తీస్తే చాలు ఆ సినిమాకి సరైన ఆదరణ లభిస్తుందని మూడేళ్ళ క్రితమే ప్రూవ్ చేసింది రాజావారు రాణిగారు.
చదవండి: సమంత పరిస్థితి విషమం? అందులో నిజమెంత
పుష్ప సినిమాలో హీరో ఎవరో తెలియదు: నటి
Comments
Please login to add a commentAdd a comment