కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు మరో షాక్ తగిలింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో అధికారులు బుధవారం రూ.500 జరిమానా విధించారు. ఇప్పటికే ఖరీదైన కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకుని లోకల్ టాక్స్ చెల్లించకపోవడంతో కేసులను ఎదుర్కొన్నారు. గత ఏడాది నవంబరులో తన కారు అద్దాలకు నలుపు రంగు కవరును అంటించిన కారణంగా రూ.500 జరిమానా కూడా చెల్లించారు. అయితే విజయ్‌కు మరోసారి ఫైన్ విధించారన్న వార్తల్లో నిజం లేదని దళపతి ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
అయితే ఈ వార్తలపై ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. విజయ్ కారు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించలేదని ఓ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరలవుతోంది. ఆవీడియో చూస్తే విజయ్‌కు ఫైన్ విధించారన్న వార్త అవాస్తమని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఆ వీడియోను షేర్ చేస్తూ అలాంటి వార్తలు రాసిన వారిపై మండిపడుతున్నారు.
ఆ వీడియోలో ఏముందంటే..
హీరో విజయ్ తన కారులో రోడ్డుపై వెళ్తు ఉండగా.. ఓ చోట సిగ్నల్ పడటంతో కారు ఆగిపోయింది. అది కూడా జీబ్రా క్రాసింగ్ అవతలే కారు నిలిచింది. గ్రీన్‌సిగ్నల్ పడిన తర్వాతే విజయ్ కారు ముందుకు కదిలింది. ఈ దృశ్యాలను విజయ్ ఫ్యాన్స్‌తో పాటు కొంతమంది మీడియా సభ్యులు కూడా వీడియో తీశారు. ఆ వీడియోలో విజయ్ ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్‌తో కలిసి ‘లియో’ సినిమా చేస్తున్నాడు. కాగా విజయ్ రాజకీయ ప్రవేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం జోరుగా ఊహాగానాలు సాగుతున్న వేళ.. ఆయనకు జరిమానా విధించడం చర్చనీయాంశంగా మారింది.
(ఇది చదవండి: సీనియర్ నిర్మాత కన్నుమూత)
(ఇది చదవండి: అర్ధరాత్రి తమిళుల ఊచకోత.. అసలేంటి 'వైట్ వ్యాన్ స్టోరీ'!)
Please listen the audio properly..
You can understand the media politics #ThalapathyVijay pic.twitter.com/cRCO24B3zE
— Vijay For Tamilnadu (@VijayForTN) July 12, 2023
Comments
Please login to add a commentAdd a comment