Krithi Shetty Demands Huge Remuneration for Surya 41th Movie - Sakshi
Sakshi News home page

Krithi Shetty: సూర్యతో సినిమా, భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తున్న బేబమ్మ

Published Thu, Mar 31 2022 8:51 AM | Last Updated on Thu, Mar 31 2022 9:12 AM

Krithi Shetty Demands Huge Remuneration for Surya 41th Movie - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య, ప్రముఖ దర్శకుడు బాలా కాంబినేషలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! దాదాపు 18 ఏళ్ల తర్వాత వీళ్ల కాంబినేషన్‌ రిపీట్‌ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సూర్య కెరీర్‌లో 41వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో 'ఉప్పెన' బ్యూటీ కృతీ శెట్టి కథానాయికగా నటించనుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పేందుకు ఆమె భారీగానే డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఉప్పెన, శ్యామ్‌ సింగరాయ్‌, బంగార్రాజు సినిమాలతో వరుస హిట్స్‌ అందుకున్న ఈ బ్యూటీ రెమ్యునరేషన్‌ను ఓ రేంజ్‌లో పెంచేసింది. ఇప్పటిదాకా తెలుగు సినిమాలకు దాదాపు కోటి రూపాయల వరకు పారితోషికం తీసుకున్న ఆమె సూర్య చిత్రానికి మాత్రం ఏకంగా రూ.1.5 కోట్లు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ యువ కథానాయిక క్రేజ్‌ను దృష్టిలో పెట్టున్న నిర్మాతలు కృతీ అడిగినంత ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

చదవండి: Salman Khan: మా సినిమాలు సౌత్‌లో పెద్దగా ఆడవెందుకో?

కాగా జ్యోతిక, సూర్య సమర్పణలో 2డీ ఎంటర్‌టైన్స్‌మెంట్‌ బ్యానర్‌లో ఈ చిత్రం నిర్మితమవుతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే కృతీశెట్టి ప్రస్తుతం ది వారియర్‌, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది.

చదవండి: 2 పెళ్లిళ్లు.. 8వ సారి సంతానం.. 63 ఏళ్ల వయసు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement