తొలి సినిమా 'ఉప్పెన'తో ఓవర్‌నైట్ క్రేజ్ సంపాదించుకుంది కృతీ శెట్టి. కుర్రకారు గుండెల్లో ధక్‌ధక్‌ధక్ అంటూ మెరుపులు మెరిపించిన కృతీ ప్రస్తుతం టాప్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరితోనూ కలిసి నటించే అవకాశాల్ని అందుకుంటుంది. టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారిపోయిన ఈ బేబమ్మకు మనుషుల్లో ఒక్క విషయం అసలు నచ్చదట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతీని హోస్ట్ అబ్బాయిల్లో మీకు నచ్చని విషయం ఏంటని అడగ్గా.. అబద్దం చెప్పేవారంటే అసహ్యమని చెప్పింది. అది అబ్బాయిలైన, అమ్మాయిలైన అని పేర్కొంది.
నిజాయితీగా, బోల్డ్‌గా ఉండే వ్యక్తులు నచ్చుతారని, ఏ విషయన్నైనా మొహమాటం లేకుండా ముఖం మీదే చెప్పేంత ధైర్యం ఉండాలని చెప్పుకొచ్చింది ఈ బేబమ్మ. ఇక తప్పు చేసిన కూడా భయపడకుండా నిజాయితిగా ఒప్పుకునే వ్యక్తిత్వం ఉన్న వారంటే ఇష్టమని, ఇక అబ్బాయిలు అబద్దం చెబితే తనకు అసలు నచ్చదని తెలిపింది. కాగా కృతీ ప్రస్తుతం నాని హీరోగా వస్తోన్న ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. దీనితో పాటు సుధీర్‌బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', రామ్ పోతినేనితో మరో సినిమాలో కృతీ హీరోయిన్‌గా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment