
సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'లగ్గం'. ఈ సినిమాకు 'రమేశ్ చెప్పాల' కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో పెళ్లిలో ఉండే విందు,చిందు, కన్నుల విందుగా చూపించబోతున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా అని మేకర్స్ తెలిపారు. రెండు రాష్ట్రాల వారు ఈ చిత్రం చూసి మెచ్చుకుంటారని వారు చెబుతున్నారు. ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు హీరో ఆది సాయికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ... 'లగ్గం టీజర్ చాలా బాగుంది. విజువల్స్ అదిరిపోయాయి. డైరెక్టర్ 'రమేష్ చెప్పాల' మంచి టేస్ట్‌తో ఈ సినిమాను తీశారనిపిస్తుంది. ఈసినిమాలో నటించిన రాజేంద్రప్రసాద్, రోహిణి, కృష్ణుడు వంటి వారితో నాకు మంచి అనుబంధం ఉంది. నాకు బాగా దగ్గరిగా ఉన్నవారందరూ ఈ సినిమాలో ఉండడం సంతోషంగా ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని ఆయన అన్నారు.
నిర్మాత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... 'మంచి సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నప్పుడు డైరెక్టర్ రమేష్ చెప్పాల తీసిన 'భీమదేవరపల్లి' సినిమా చూశాను. చాలా బాగా నచ్చి వెంటనే రమేష్‌తో సినిమా చేయాలని అనుకున్నాను. ఈ క్రమంలో రమేష్ 'లగ్గం' కథ చెప్పడం జరిగింది. కథ నచ్చి వెంటనే సినిమా స్టార్ట్ చేశా. మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే, ఫీల్ గుడ్ సాంగ్స్ లగ్గం సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment