అన్నా, వదినొస్తుందట.. దావత్‌ లేదా? | Larissa Bonesi Thinking of Visiting Hyderabad, Fans Asks Sai Dharam Tej Big Party | Sakshi
Sakshi News home page

Sai Dharam Tej: ఆ హీరోయిన్‌ రాక కోసం మెగా హీరో వెయిటింగ్‌!

Published Sun, Jul 11 2021 9:25 PM | Last Updated on Sun, Jul 11 2021 9:27 PM

Larissa Bonesi Thinking of Visiting Hyderabad, Fans Asks Sai Dharam Tej Big Party - Sakshi

లారిస్సా బొనేసి... 'రాకెట్‌ రాజా', 'నెక్స్ట్‌ ఏంటి?' చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి కనువింది చేసిందీ బ్రెజిల్‌ మోడల్‌. సాయిధరమ్‌తేజ్‌తో కలిసి 'తిక్క' సినిమాలోనూ ఆడిపాడింది. ఈ బ్యూటీ అంటే తేజ్‌కు కొంచెం ఇంట్రస్ట్‌ ఎక్కువ. ఈ విషయాన్ని అతడే గతంలో చాలాసార్లు చెప్పాడు. సెట్‌లో తొలిసారి ఆమెను చూసిన వెంటనే మైమరిచిపోయానని, లారిస్సా బొనేసి అంటే ఎంతో ఇష్టమని మనసులోని మాటను బయటపెట్టాడు.

ఇదిలా వుంటే త్వరలో హైదరాబాద్‌కు రావాలనుకుంటోందట లారిస్సా బొనేసి. 'చాలా రోజులకు హైదరాబాద్‌ రావాలనిపిస్తోంది. త్వరలోనే వస్తాను' అంటూ ఇటీవలే ట్వీట్‌ చేసింది. ఇంకేముందీ.. సాయిధరమ్‌ తేజ్‌ ఆ ట్వీట్‌ దగ్గర వాలిపోయి ఆమె రాక కోసం తహతహలాడుతున్నట్లుగా రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన జనాలు ఊరుకుంటారా? అన్నా వదినొస్తుంది.. దావత్‌ ఇవ్వాలి, అన్నకి పండగే ఐతే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి లారిస్సా ఎప్పుడొస్తుందో, సాయిధరమ్‌ తేజ్‌ ఆమెను ఎప్పుడు కలుస్తాడో చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement