లవ్‌ మాక్‌టైల్‌ 2 నుంచి బ్యూటిఫుల్‌ సాంగ్‌.. | Love Mocktail 2 movie: Evaritho Payanam Song Released | Sakshi
Sakshi News home page

లవ్‌ మాక్‌టైల్‌ 2 నుంచి బ్యూటిఫుల్‌ సాంగ్‌.. విన్నారా?

Published Wed, Mar 27 2024 7:30 PM | Last Updated on Wed, Mar 27 2024 7:35 PM

Love Mocktail 2 movie: Evaritho Payanam Song Released - Sakshi

కన్నడ బ్లాక్ బస్టర్ నిర్మాత, రచయిత, దర్శకుడు హీరో డార్లింగ్ కృష్ణ నటించిన చిత్రం లవ్ మాక్‌టైల్‌ 2. ఈ మూవీ నుంచి బుధవారం నాడు.. ఎవరితో పయనం సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు నకుల్ అభయాన్కర్ మంచి మ్యూజిక్ అందించాడు. ఎవరితో పయనం అంటూ సాగే ఈ పాటకి గురు చరణ్ లిరిక్స్ అందించగా యోగి సురేష్ అద్భుతంగా పాడారు. డార్లింగ్ కృష్ణ గతంలో జాకీ, మధరంగి, రుద్రతాండవ, చార్లీ లవ్ మాక్‌టైల్‌ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.

ఈ సినిమాలో మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. అదేవిధంగా తను నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తూ హీరోగా నటించిన లవ్ మాక్‌టైల్‌, లవ్ మాక్‌టైల్‌ 2 చిత్రాలు కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ పతాకం పై ఎం వి ఆర్ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ఎం.వి.ఆర్ కృష్ణ గారు మాట్లాడుతూ.. 'కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను వేసవి సెలవుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. మంచి సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ సినిమా కూడా కంటెంట్ ఉన్న ఒక మంచి సినిమా. ఈ చిత్రాన్ని ఆదరించి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement