![Love Today Actress Ivana Said Allu Arjun Is Her Favorite Hero In Telugu - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/29/actress-ivana.jpg.webp?itok=4B693N9_)
‘లవ్ టుడే’ సినిమాతో ఇటీవలే తెలుగు ప్రేక్షకుల పరిచయమైంది కేరళ బ్యూటీ ఇవాన. ఎలాంటి అంచనాలు లేకుండా తమిళనాట నవంబర్ 4న విడుదలైన ఈ చిత్రం అక్కడ భారీ విజయాన్ని సాధించింది. కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే.. రూ.60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి తమిళ్‌లో చరిత్ర సృష్టించింది. దీంతో ఈ సినిమాను తెలుగులోకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకొచ్చారు. నవంబర్ 25న టాలీవుడ్‌లో విడుదలైన ఈచిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ మూవీ రూ. 2.35 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఇక ఈ మూవీ సక్సెస్ నేపథ్యంలో తాజాగా ఓ తెలుగు చానల్‌తో ముచ్చటించింది లవ్ టుడే బ్యూటీ ఇవాన. ఈ సందర్భంగా ఓ తెలుగు స్టార్ హీరో ఫ్యాన్‌ని అంటూ ఆసక్తికర విషయం చెప్పంది. ‘‘తెలుగు సినిమాలు నేను చూస్తూనే ఉంటాను. ‘హ్యాపీ డేస్’ నుంచి ‘జాతి రత్నాలు’ వరకూ చాలా సినిమా చూశాను. తెలుగులో నా ఫేవరేట్ హీరో అల్లు అర్జున్. ఆయన సినిమాలను తప్పకుండా చూస్తుంటాను. ఆయన యాక్టింగ్, డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం’’ అంటూ చెప్పుకొచ్చింది.
చదవండి:
కృష్ణలో ఏదో ఆకర్షణ శక్తి ఉండేది, అందుకే ఆయనతో..: చంద్రమోహన్
బిగ్‌బాస్ 6: ఆర్జీవీతో డాన్స్ వీడియోపై ఇనయా సుల్తానా ఏమందంటే..
Comments
Please login to add a commentAdd a comment