తమిళ్ బ్లాక్ బస్టర్ ‘కోమలి’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటిస్తూ, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘లవ్ టుడే’. ఎలాంటి అంచనాలు లేకుండా తమిళనాట నవంబర్ 4న విడుదలైన ఈ చిత్రం అక్కడ భారీ విజయాన్ని సాధించింది. కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే.. రూ.60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి తమిళ్‌లో చరిత్ర సృష్టించింది. దీంతో ఈ సినిమాను తెలుగులోకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకొచ్చారు. నవంబర్ 25న టాలీవుడ్‌లో విడుదలైన ఈచిత్రానికి.. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. విడుదలైన రెండు రోజుల్లోనే 2.35 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ప్రేమకథకు కామెడీని జోడించి ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు ప్రదీప్. ఈ చిత్రంలో ప్రదీప్‌కు జోడీగా ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. థియేటర్స్‌లో విజయవంతంగా కొనసాగుతున్న ఈ సినిమా.. అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ని భారీ మొత్తానికి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 2నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment