
‘ఆకు పాకు ఇస్తరాకు.. ఆల్ సైడ్స్ రోడ్స్ బ్లాకు..’ అంటూ సాగే పాట ‘జిలేబి’ చిత్రంలోనిది. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’, ‘మన్మథుడు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కె. విజయభాస్కర్ కొంత గ్యాప్ తర్వాత తెరకెక్కించిన చిత్రం ఇది. శ్రీ కమల్, శివానీ రాజశేఖర్ జంటగా గుంటూరు రామకృష్ణ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాలోని ‘ఆకు పా కు..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు మణిశర్మ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పా డారు.
Comments
Please login to add a commentAdd a comment