మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిసినప్పటికీ ఎన్నికల రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన వారంతా రాజీనామా చేయడంతో కొత్త చర్చకు దారి తీసింది. ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పదవికి ఎన్నికైన మంచు విష్ణు ఈ మూకుమ్మడి రాజీనామాలపై ఎలా స్పందిస్తాడా! అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో.. విష్ణు మాత్రం కూల్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడు. బుధవారం అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం పెన్షన్ ఫైల్‌పై సంతకం చేశాడు. ఇక తర్వాత ఏం జరగనుంది.. ఎవరూ ఎలా స్పందిస్తారోనని వేచి చూస్తుండగా ఆసక్తిగా మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ఈ రోజు నందమూరి బాలకృష్ణతో భేటీ అయ్యాడు.
చదవండి: చిరంజీవిపై నరేశ్ సంచలన వ్యాఖ్యలు, ఘాటుగా స్పందించిన నాగబాబు
ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై బాలయ్యతో చర్చించినట్లు సమాచారం. ‘మా’ అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం అనంతరం విష్ణు మొదటి సారిగా బాలకృష్ణను కలవడం చర్చకు దారి తీసింది. భేటీ అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకునేందుకే వచ్చానని స్పష్టం చేశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవిని కలుస్తానని కూడా చెప్పాడు. ఈ నెల 16న ఎన్నికల అధికారి తన ప్యానల్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పాడు. ఇక రాజీనామాలపై ఈసీతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని విష్ణు పేర్కొన్నాడు. అనంతరం మోహన్ బాబు కూడా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో విష్ణుకు బాలకృష్ణ అండగా నిలిచారని, ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చామని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment