Maanvi Gagroo Ties The Knot With Comedian Kumar Varun, Photos Viral - Sakshi
Sakshi News home page

Maanvi Gagroo: కమెడియన్‌తో నటి ప్రేమ వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్‌

Published Thu, Feb 23 2023 3:54 PM | Last Updated on Thu, Feb 23 2023 6:15 PM

Maanvi Gagroo Ties the Knot with Comedian Kumar Varun, Photos Viral - Sakshi

బాలీవుడ్‌ నటి మాన్వి గాగ్రూ కమెడియన్‌ కుమార్‌ వరుణ్‌ను పెళ్లాడింది. జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తాజాగా పెళ్లి పీటలెక్కింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను నూతన వధూవరులిద్దరూ గురువారం సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 'ఇరు కుటుంబాలు సహా అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో మా పెళ్లి జరిగింది. ఫిబ్రవరి 23న మేము వివాహబంధంతో ఒక్కటయ్యాం. దీన్ని అధికారికంగా ప్రకటిస్తున్నాం. ఇప్పటివరకు మా ఇద్దరినీ ఆదరించిన ప్రతిఒక్కరూ ఇకపై మమ్మల్ని జంటగా ఆదరించండి, ఆశీర్వదించండి' అని రాసుకొచ్చారు. పెళ్లి ఫోటోల్లో మాన్వి సింధూరం రంగు చీరలో మెరిసిపోతుండగా వరుణ్‌ తెల్లని వస్త్రాలు ధరించి తలకు పాగా పెట్టుకున్నాడు. ఈ తతంగం అంతా చిన్నగా కానిచ్చినందుకుగానూ సాయంత్రం పెళ్లి పార్టీ జరగనున్నట్లు తెలుస్తోంది.

కాగా మాన్వీ గాగ్రూ పీకే, ఉజ్దా చమాన్‌, శుభ్‌ మంగళ్‌ జ్యాద సావధాన్‌, ఆమ్రాస్‌: ద స్వీట్‌ టేస్ట్‌ ఆఫ్‌ ఫ్రెండ్‌షిప్‌, ఎ క్వశ్చన్‌ మార్క్‌, గాయ్‌ ఇన్‌ ద స్కై,ఉజ్దా చామన్‌, 377 అబ్‌నార్మల్‌ వంటి పలు చిత్రాల్లో నటించింది. ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌, పిచర్స్‌, ట్రిప్లింగ్స్‌, తామశ్రీ వంటి వెబ్‌సిరీస్‌లోనూ యాక్ట్‌ చేసింది. వరుణ్‌ విషయానికి వస్తే అతడు స్టాండప్‌ కమెడియన్‌ మాత్రమే కాదు క్విజ్‌ మాస్టర్‌ కూడా! అలాగే లాఖో మే ఏక్‌, చాచా విధాయక్‌ హై హమారే వంటి షోలలనూ నటించాడు.

చదవండి: చనిపోవడానికి ముందు శ్రీదేవి దిగిన చివరి ఫోటో ఇదే
రాజమౌళి అంత మాట అనడంతో నా గుండె ముక్కలైంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement