Maaya Ganga Song Out From Banaras Movie | Zaid Khan - Sakshi
Sakshi News home page

Banaras-Maaya Ganga Song: బెనారస్‌ మూవీలోని మాయ గంగ సాంగ్‌ విన్నారా?

Published Fri, Jul 1 2022 10:21 AM | Last Updated on Fri, Jul 1 2022 12:04 PM

Maaya Ganga Song Out From Banaras - Sakshi

కేజీఎఫ్‌ తరువాత కన్నడ చిత్ర పరిశ్రమ పాన్‌ ఇండియాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా కన్నడ నటుడు జైద్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన బెనారస్‌ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తిలక్‌ బల్లాల్‌ నిర్మించిన ఈ చిత్రం త్వరలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.

కాగా ఇందులోని మాయ గంగ అనే తమిళ వెర్షన్‌ పాటను చిత్రయూనిట్‌ గురువారం సాయంత్రం చెన్నైలో విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నిర్మాత జీకే రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పాటను ఆవిష్కరించారు. ఇది కాశీలో జరిగే ప్రేమ కథా చిత్రమని దర్శకుడు తెలిపారు. బాహ్య సౌందర్యం కాకుండా అంతర సౌందర్యమే నిజమైన ప్రేమ చెప్పే చిత్రం ఇదని పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు మాట్లాడుతూ తొలి చిత్రమే పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కావడంపై ఆనందం వ్యక్తం చేశారు.

చదవండి: శ్రీరామ్‌, అవికాగోర్‌ 'టెన్త్‌ క్లాస్ డైరీస్‌' సినిమా రివ్యూ
 జూలై 1న ఓటీటీలో రిలీజ్‌ అవుతున్న సినిమాలు, సిరీస్‌లు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement