
ఎస్ఆర్పీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తీస్తున్న మొదటి సినిమా 'మేడమ్ చీఫ్ మినిస్టర్’. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో శనివారం ఈ చిత్రం లాంఛనంగా మొదలైంది. డా.సూర్య రేవతి మెట్టకూరు హీరోయిన్‌గా నటిస్తూ.. దర్శకనిర్మాణం చేస్తున్నారు.
(ఇదీ చదవండి: 'స్కంద' కలెక్షన్స్.. సగానికి సగం పడిపోయాయి!)
ఈ సినిమా పూజా కార్యక్రమానికి తెలంగాణ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 5 భాషల్లో తీస్తున్న ఈ సినిమా సక్సెస్‌ఫుల్ కావాలని అన్నారు. నటి-దర్శకనిర్మాత రేవతి మాట్లాడుతూ.. సినిమా సమాజంపై అత్యంత ప్రభావం చూపించే మీడియా. అందుకే 'మేడమ్ చీఫ్ మినిస్టర్' ప్రారంభించా. టైటిల్ చూసి ఇదేదో పొలిటికల్ సినిమా అనుకోవద్దని, పబ్లిక్ మూవీ అని ఆమె చెప్పారు.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్!)
Comments
Please login to add a commentAdd a comment