![Mahesh Babu, Director Trivikram next movie is Ayodhya lo Arjunudu - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/27/Mahesh-%281%29.jpg.webp?itok=2nXEYUDG)
‘అతడు’(2005), ‘ఖలేజా’ (2010) చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై చినబాబు (ఎస్.రాధాకృష్ణ) నిర్మిస్తున్న ఈ మూవీ తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. దసరా తర్వాత ప్రారంభమయ్యే మలి షెడ్యూల్‌లో మహేశ్, పూజలపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ సినిమా టైటిల్‌గా గతంలో ‘పార్థు’, ‘అర్జునుడు’ అనే పేర్లు తెరపైకి వచ్చాయి.
తాజాగా ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్‌ను యూనిట్ పరిశీలిస్తోందని టాక్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గత నాలుగు చిత్రాలు (అఆ, అజ్ఞాత వాసి, అరవిందసమేత వీర రాఘవ, అల..వైకుంఠపురములో..) టైటిల్స్ ‘అ’ అక్షరంతోనే మొదలయ్యాయి. దీంతో మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లోని తాజా చిత్రం టైటిల్ కూడా ‘అ’ తోనే మొదలవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment