Mahesh Babu Sarkaru Vaari Paata Trailer Out Now: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే12న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఈ క్రమంలో వరుస అప్‌డేట్ ఇస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన రాగా.. కళావతి, ఎవ్రీ పెన్నీ పాటలు అత్యధిక వ్యూస్‌తో రికార్డు క్రియేట్ చేశాయి.
చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్
ఈ నేపథ్యంలో నేడు(మే 2) సర్కారు వారి పాట ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో ట్రైలార్ లాంచ్ ఈవెంట్‌ను కూకటపల్లిలోని భ్రమరాంబ థియేటర్లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబుకు సంబంధించి మెంటల్ మాస్ స్వాగ్‌తో కూడిన 105 షార్ట్స్ గల ట్రైలర్ వదిలారు మేకర్స్. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. యాక్షన్, రొమాన్స్ సన్నివేశాలతో సాంతం ఆకట్టుకుంటోంది.
చదవండి: హీరో విశ్వక్ సేన్‌పై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు
‘యు కెన్ స్టీల్ మై లవ్(నా ప్రేమ దొంగలించగలవు), యు కెన్ స్టీల్ మై ఫ్రెండ్‌షిప్(నా స్నేహాన్నీ.. దొంగలించగలవు’.. బట్ యు కాంట్ స్టీల్ మై మనీ’ అంటూ మహేశ్ చెప్పే డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కీర్తి సురేశ్‌తో మహేశ్ బాబు రొమాన్స్ సీన్స్, ఫన్నీ డైలాగ్స్ నెక్ట్‌లెవల్ అని చెప్పొచ్చు. ఇక యాక్షన్ సీన్స్ చూస్తుంటే సూపర్ స్టార్ అభిమాలకు చిత్ర బృందం మంచి ట్రీట్ ఇచ్చిందనడంలో ఎలాంటి అతిశయేక్తిలేదు. కాగా మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment