మీరు నిజమైన ఛాంపియన్‌: మహేశ్‌బాబు | Mahesh Babu Supports to Vinesh Phogat | Sakshi
Sakshi News home page

పతకం ముఖ్యం కాదు, మీరే అసలైన ఛాంపియన్‌.. మహేశ్‌బాబు

Aug 8 2024 8:23 AM | Updated on Aug 8 2024 10:11 AM

Mahesh Babu Supports to Vinesh Phogat

ఒలంపిక్‌ పతకానికి అడుగుదూరంలో ఉన్న భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. 100 గ్రాముల అధిక బరువు వల్ల ఆమె ఫైనల్స్‌లో లేకుండా పోయింది. ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి పోరాడిన ఆమెకు పలువురు సెలబ్రిటీలు మద్దతిస్తున్నారు.

మీరు ఛాంపియన్‌
తాజాగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ఆమెకు ధైర్యం చెప్తూ అండగా నిలబడ్డాడు. తాజా ఫలితాలతో సంబంధం లేదు. మీరు ఆ నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొన్నారన్నదే మీ గొప్పతనం. వినేశ్‌ ఫొగట్‌.. మీరొక నిజమైన ఛాంపియన్‌ అని అందరికీ రుజువు చేశారు. మీ ధైర్యం, బలం అందరికీ స్ఫూర్తి. 

మీరే స్ఫూర్తి
పతకం వచ్చిందా? లేదా? అన్నది ముఖ్యం కాదు. మీ స్ఫూర్తి మా అందరిలోనూ ప్రకాశిస్తోంది.1.4 బిలియన్‌ హృదయాలు మీతోనే ఉన్నాయి అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చాడు. ఇకపోతే ఒలంపిక్స్‌లో తీవ్ర నిరాశ చెందిన వినేశ్‌ ఫొగట్‌.. రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement