
మలయాళ నటుడు విజిలేశ్ త్వరలో ఓ ఇంటివాడిని కాబోతున్నానంటూ గతేడాది ప్రకటించాడు. నవంబర్‌లో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నాడు. ఈ మధ్యే పెళ్లి డేట్‌ను ప్రకటించిన ఆయన కాబోయే భార్య స్వాతి హరిదాస్‌తో దిగిన ప్రీవెడ్డింగ్ ఫొటోలను సైతం అభిమానులతో పంచుకున్నాడు. ముందుగా అనుకున్న ముహూర్తం ప్రకారం మార్చి 29న వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నట్లు వెల్లడించాడు.
విజిలేశ్ కెరీర్ విషయానికొస్తే.. 'మహేశింటే ప్రతీకారం' సినిమా అతడికి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి దిలీశ్ పోతన్ దర్శకత్వం వహించాడు. ఇది తెలుగులో 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య'గా రీమేక్ అయింది. విజిలేశ్ తర్వాత గుప్పీ, అల్మారా, చిప్పీ, విమానం వంటి పలు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు. వారతాన్‌లో తాను పోషించిన జితిన్ పాత్ర అతడి కెరీర్‌లోనే ఒక మైలురాయిలా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment