![Manchu Manoj And Mounika Daughter Name Riveel](/styles/webp/s3/article_images/2024/07/8/ManchuManoj-01.jpg.webp?itok=4tqAg82d)
టాలీవుడ్ హీరో మంచు మనోజ్, మౌనిక దంపతులు ఏప్రిల్ 13న పండంటి పాపకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తమ ముద్దల కూతురుకు పేరు పెట్టారు. గతేడాది రెండు కుటుంబాల అంగీకారంతో వివాహబంధంలోకి ఈ జంట అడుగుపెట్టింది. ఈ ఇద్దరికి ఇది రెండో వివాహమే. మాజీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుమార్తెనే మౌనిక.
![](/sites/default/files/inline-images/1_211.jpg)
తమ ముద్దుల కుమార్తెకు 'దేవసేన శోభా MM' అని మంచు మనోజ్ నామకరణం చేశారు. ఆ పేరును సూచించడం వెనుకున్న కారణాన్ని తన ఇన్‌స్టాలో ఇలా వివరించారు. 'మీ అందరి ఆశీస్సులతో మా బిడ్డ 'దేవసేన శోభ MM'ను మీకు పరిచయం చేస్తున్నాం. ఇప్పటికే ఎమ్‌ఎమ్ పులి అనే తన ముద్దు పేరు ద్వారా అందరికీ బాగా తెలుసు. ఆ పరమేశ్వరుడి భుక్తులమైన మేము.. మా చిన్నారి తల్లి పేరును సాక్షాత్తు ఆ శివుని కుటుంబంలో సుబ్రహ్మణ్య స్వామి సతీమణి అయిన 'దేవసేన' పేరును మా పాపకు పెట్టుకున్నాం. మా అత్తగారు స్వర్గీయ శ్రీమతి శోభా నాగిరెడ్డి గారి పేరు నుంచి 'శోభ' అనే పేరును తీసుకున్నాం.
![](/sites/default/files/inline-images/2_150.jpg)
వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉంటాయి. మా జీవితంలో ఎల్లప్పుడూ అండగా ఉంటూ.. మాకు కొండంత బలంగా నిలుస్తున్న మా తల్లిదండ్రులు మోహన్ బాబు గారు శ్రీమతి నిర్మలా దేవి గారి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి. నా జీవితంలో మొదటి నుంచి ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటున్న మా అక్క లక్ష్మీ మంచు గారికి నా ధన్యవాదాలు.' అంటూ మనోజ్ ఒక లేఖను పంచుకున్నారు. దేవసేన పేరు చాలా బాగుందంటూ నెటిజన్లు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment