devasena
-
కూతురు పేరు ప్రకటించిన మంచు మనోజ్, మౌనిక
టాలీవుడ్ హీరో మంచు మనోజ్, మౌనిక దంపతులు ఏప్రిల్ 13న పండంటి పాపకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తమ ముద్దల కూతురుకు పేరు పెట్టారు. గతేడాది రెండు కుటుంబాల అంగీకారంతో వివాహబంధంలోకి ఈ జంట అడుగుపెట్టింది. ఈ ఇద్దరికి ఇది రెండో వివాహమే. మాజీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుమార్తెనే మౌనిక.తమ ముద్దుల కుమార్తెకు 'దేవసేన శోభా MM' అని మంచు మనోజ్ నామకరణం చేశారు. ఆ పేరును సూచించడం వెనుకున్న కారణాన్ని తన ఇన్‌స్టాలో ఇలా వివరించారు. 'మీ అందరి ఆశీస్సులతో మా బిడ్డ 'దేవసేన శోభ MM'ను మీకు పరిచయం చేస్తున్నాం. ఇప్పటికే ఎమ్ఎమ్ పులి అనే తన ముద్దు పేరు ద్వారా అందరికీ బాగా తెలుసు. ఆ పరమేశ్వరుడి భుక్తులమైన మేము.. మా చిన్నారి తల్లి పేరును సాక్షాత్తు ఆ శివుని కుటుంబంలో సుబ్రహ్మణ్య స్వామి సతీమణి అయిన 'దేవసేన' పేరును మా పాపకు పెట్టుకున్నాం. మా అత్తగారు స్వర్గీయ శ్రీమతి శోభా నాగిరెడ్డి గారి పేరు నుంచి 'శోభ' అనే పేరును తీసుకున్నాం. వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉంటాయి. మా జీవితంలో ఎల్లప్పుడూ అండగా ఉంటూ.. మాకు కొండంత బలంగా నిలుస్తున్న మా తల్లిదండ్రులు మోహన్ బాబు గారు శ్రీమతి నిర్మలా దేవి గారి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి. నా జీవితంలో మొదటి నుంచి ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటున్న మా అక్క లక్ష్మీ మంచు గారికి నా ధన్యవాదాలు.' అంటూ మనోజ్ ఒక లేఖను పంచుకున్నారు. దేవసేన పేరు చాలా బాగుందంటూ నెటిజన్లు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
నెరవేరిన టీచర్ల కల
సాక్షి, హైదరాబాద్: పదోన్నతుల కోసం దాదాపు దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల కల ఎట్టకేలకు నెరవేరింది. రంగారెడ్డి జిల్లా మినహా రెండు జోన్లలోనూ పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. చివరిసారిగా 2015లో పదోన్నతులు కల్పించారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ప్రమోషన్ల ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. టీచర్ల హేతుబదీ్ధకరణ చేపట్టాలని కొన్నాళ్లు భావించారు. కోర్టు కేసుల కారణంగా మరికొంత జాప్యం జరిగింది. 2023లో బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మల్టీజోన్–1లో కొంత వరకూ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ ముందుకెళ్లింది. అంతలోనే స్పౌజ్ కేసుల కారణంగా ఇది ఆగిపోయింది. పండిట్లు తమ పోస్టులు తమకే ఇవ్వాలన్న డిమాండ్‌తో కోర్టును ఆశ్రయించారు. వీటిని పక్కనబెట్టి ప్రమోషన్లు ఇవ్వాలని భావించారు. ఈ సమయంలో ప్రమోషన్లకు టెట్ ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనను కొంతమంది టీచర్లు ముందుకు తెచ్చారు. న్యాయస్థానం స్టే కారణంగా 2023లో ఇది ఆగిపోయింది. ఈలోగా ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమోషన్లు, బదిలీలు చేయాలని అధికారులు కంకణం కట్టుకున్నారు. ఈ వ్యవహారంలో పాఠశాల విద్య కమిషనర్ దేవసేన ప్రత్యేక దృష్టి పెట్టారు. వ్యూహాత్మకంగా న్యాయ పరమైన చిక్కులు తొలగించారు. దీంతో 18,942 మందికి ఒకేసారి పదోన్నతులు దక్కాయి. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా, కొంతమంది, స్కూల్ అసిస్టెంట్ల నుంచి హెచ్ఎంలుగా మరికొంతమంది ప్రమోషన్లు పొందారు. వీళ్లందరినీ బదిలీ చేశారు. దీంతో ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఖాళీలు 22 వేల పైనే... బదిలీలు, పదోన్నతుల తర్వాత వాస్తవ ఖాళీలు అధికారులు లెక్కగట్టాల్సి ఉంది. ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో 22 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉండే వీలుంది. 18,942 మందికి ప్రమోషన్లు ఇచ్చినా... వీరిలో 3 వేల మంది ఒకటికి మించి పదోన్నతులకు అర్హత ఉన్నవారున్నారు. ఉదాహరణకు సైన్స్, మేథ్స్ సబ్జెక్టులు రెండింటికీ అర్హత ఉంటుంది. పదోన్నతి రెండింటికీ లభిస్తుంది. అయితే, టీచర్ ఒకే సబ్జెక్టులో పదోన్నతి తీసుకోవాలి. ఈ రకంగా 3 వేల ఖాళీలు ఏర్పడే వీలుంది. జిల్లాల వారీగా ఈ లెక్కలు తేలితే... ఈ స్థానంలో మరికొన్ని పదోన్నతులు లభించే అవకాశముంది. జూలైలో నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో ప్రస్తుతం 11 వేల పోస్టులను చేర్చారు. పదోన్నతుల ద్వారా మరో 11 వేల వరకూ ఖాళీ అయ్యే వీలుంది. వీటిని కూడా చేర్చి, పూర్తిస్థాయిలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇదో చరిత్ర : ముఖ్యమంత్రి కార్యాలయం ఇంత పెద్ద మొత్తంలో టీచర్లకు పదోన్నతులు కల్పించడం రాష్ట్ర చరిత్రలోనే గొప్ప విషయమని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఓ ప్రకటనలో పేర్కొంది. ఎక్కడా ఎలాంటి వివాదానికి తావివ్వకుండా, చట్టపరమైన చిక్కులను అధిగమించడంలో ప్రభుత్వం చూపిన చొరవను ఉపాధ్యాయ సంఘాలు ప్రశంసిస్తున్నాయని తెలిపింది. టీచర్ల కష్టాన్ని, శ్రమను ప్రభుత్వం గుర్తించిందని, సముచిత రీతిలో గౌరవించిందని, ఈ కారణంగా టీచర్లు మరింత కంకణబద్దులై పనిచేస్తారన్న ఆశాభావాన్ని సీఎంవో వ్యక్తం చేసింది. ఖాళీలు 22 వేల పైనే...బదిలీలు, పదోన్నతుల తర్వాత వాస్తవ ఖాళీలను అధికారులు లెక్కగట్టాల్సి ఉంది. ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో 22 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉండే వీలుంది. 18,942 మందికి ప్రమోషన్లు ఇచ్చినా.. వీరిలో 3 వేల మంది ఒకటికి మించి పదోన్నతులకు అర్హత ఉన్నవారున్నారు. ఉదాహరణకు సైన్స్, మేథ్స్ సబ్జెక్టులు రెండింటికీ అర్హత ఉంటుంది. పదోన్నతి రెండింటికీ లభిస్తుంది. అయితే, టీచర్ ఒకే సబ్జెక్టులో పదోన్నతి తీసుకోవాలి. ఈ రకంగా 3 వేల ఖాళీలు ఏర్పడే వీలుంది. జిల్లాల వారీగా ఈ లెక్కలు తేలితే... ఈ స్థానంలో మరికొన్ని పదోన్నతులు లభించే అవకాశముంది. జూలైలో నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో ప్రస్తుతం 11 వేల పోస్టులను చేర్చారు. పదోన్నతుల ద్వారా మరో 11 వేల వరకూ ఖాళీ అయ్యే వీలుంది. వీటిని కూడా చేర్చి, పూర్తిస్థాయిలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. -
మే 20 నుంచి టెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను మే 20 నుంచి జూన్ 3 వరకూ నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన గురువారం ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్, సమాచార బులెటిన్‌ను ఈ నెల 20న స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో వెల్లడిస్తామని తెలిపారు. కంప్యూటర్ బేస్డ్గా జరిగే ఈ పరీక్షకు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు పంపుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను గత నెల 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే మొదలు కాగా, ఈ గడువు ఏప్రిల్ 3తో ముగుస్తుంది. టెట్‌లో అర్హత సాధిస్తే తప్ప డీఎస్సీ రాసేందుకు అర్హత ఉండదు. దీనివల్ల టెట్ అర్హత లేని బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు డీఎస్సీ రాసే వీలు ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్‌ను డీఎస్సీకి ముందే నిర్వహించాలని, ఇందులో అర్హత సాధించిన వారికి డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తు తేదీలను కూడా పొడిగించారు. జూన్ 6 వరకూ డీఎస్సీ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు దేవసేన తెలిపారు. డీఎస్సీ పరీక్షను ఆన్లైన్ మోడ్‌లో జూలై 17 నుంచి 31 వరకు నిర్వహిస్తు న్నట్టు కమిషనరేట్ పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకూ ఇదే టెట్‌లో పాల్గొనేందుకు చాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు వెల్లడవ్వాల్సి ఉంది. టీచర్ల పదోన్నతులకు టెట్ తప్పనిసరి చేయడంతో 80 వేల మంది ఉపాధ్యాయులు టెట్ రాయాల్సి ఉంటుంది. -
15 నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఈ నెల 15 నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఎయిడెడ్, ప్రైవేటు యాజమా న్యాలన్నీ ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 12.30 గంటల నుంచి అమలు చేయాలని, పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందించిన తర్వాతే ఇంటికి పంపించాలని నిర్దే శించింది. పదోతరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుండ టంతో పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లను మధ్యా హ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు నిర్వహించాలని చెప్పింది. 2023–24 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినంగా విద్యాశాఖ నిర్దేశించింది. దీంతో అప్పటివరకు ఒంటిపూట బడులే నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈ సమాచారాన్ని పంపాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. -
అత్యున్నత ఫలితాలే లక్ష్యం కావాలి
సాక్షి, హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో గుణాత్మక మార్పు తేవాలని విద్యాశాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. టెన్త్, ఇంటర్మిడియెట్ పరీక్షలు స్వేచ్ఛాయుతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని కోరారు. అత్యున్నత స్థాయి ఫలితాలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ తొలిసారిగా మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మిడియెట్ బోర్డు కార్యదర్శి హోదాలో నవీన్ మిత్తల్, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన హాజరయ్యారు. ఇంటర్, టెన్త్ పరీక్షలకు సంబంధించిన సమగ్ర వివరాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు, రాబోయే ఫలితాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన ఫలితాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరారు. గత ఏడాది పేపర్ లీకేజీ ఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు తెలిసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాలని కోరారు. కాగా ఆన్లైన్ మూల్యాంకన విధానాన్ని ఇంటర్ అధికారులు సీఎంకు వివరించారు. దీనివల్ల అతి తక్కువ సమయంలో ఫలితాల వెల్లడికి ఆస్కారం ఉందని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ దిశగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన సిఫారసులు, వాటి సాధ్యాసాధ్యాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది. ప్రైవేటుతో సమానంగా ఫలితాలు రావాలి ప్రైవేటు విద్యా సంస్థలతో సమానంగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మెరుగైన ఫలితాలు రావాల్సిన అవసరాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నొక్కి చెప్పారు. దీంతో గురుకులాల్లో మెరుగైన ఫలితాలు వస్తున్న తీరును అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చా రు. ఈ క్రమంలోనే గురుకులాల్లో మాదిరిగా ప్రభు త్వ స్కూళ్లల్లోనూ ఫలితాలు పెంచాల్సిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన బోధన, పరీక్షలకు సన్నద్ధమయ్యే మెళకువలు మెరుగు పర్చేందుకు సరికొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. ఇంటర్ తర్వాత జరిగే పోటీ పరీక్షలకు రాష్ట్ర విద్యార్థులను, ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులను సన్నద్ధం చేయాలని, ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని సూచించారు. మండలానికో కాలేజీ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ విద్యార్థులకు కాలేజీలు అందుబాటులో ఉండాలని సీఎం చెప్పారు. ప్రతి మండలానికి ఓ కాలేజీ ఏర్పాటు అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో అవసరాన్ని బట్టి అధ్యాపకులను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో సీట్లు మిగిలిపోతుండటంపై ఆయన ఆరా తీశారు. పదోన్నతులు చేపడితే ఖాళీలపై స్పష్టత రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు, పరీక్షలు, ఫలితాల గురించి దేవసేన సీఎంకు వివరించారు. వివిధ సబ్జెక్టు టీచర్ల కొరత, ఖాళీల భర్తీ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో జరిగిన కసరత్తు చర్చకు వచ్చినట్టు తెలిసింది. 5 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి ఎన్నికల ముందు చేపట్టిన ప్రక్రియ ఆగి పోయిందని అధికారులు తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో 18 వేలకు పైగా ఖాళీలున్నాయని, పదోన్నతులు చేపడితే ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై స్పష్టమైన సమాచారం వస్తుందని వివరించారు. టెట్ ఉత్తీర్ణులకే పదోన్నతులు ఇవ్వాలన్న కోర్టు తీర్పు అడ్డంకిగా ఉందని చెప్పగా, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పినట్లు సమాచారం. -
త్వరలో టెట్ పరీక్ష! తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం.. ‘కానీ, ఎందుకు?’
సాక్షి, హైదరాబాద్: త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై వెంటనే కసరత్తు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం దీనికి ఆమోదం తెలిపింది. మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యాశాఖలో దాదాపు 22 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంశం ఇందులో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తవకుండా నియామకాలు చేపట్టలేమని అధికారులు మంత్రులకు వివరించినట్టు సమాచారం. దీంతో నిరుద్యోగుల్లో అసంతృప్తిని పోగొట్టేందుకు తక్షణమే టెట్ నిర్వహించాలని భావించినట్టు తెలిసింది. భర్తీ కోసం ఎదురుచూపులే..! రాష్ట్ర అవతరణ తర్వాత 2016లో తొలిసారిగా టెట్ నిర్వహించారు. తర్వాత 2017, 2022లలోనూ నిర్వహించారు. ఇందులో గతేడాది టెట్ పరీక్ష సమయంలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వస్తున్నాయన్న ఆశతో ఎక్కువ మంది పరీక్ష రాశారు. కానీ ఏడాది గడచినా నియామకాలేవీ చేపట్టలేదు. 2016 నుంచి టెట్ అర్హత పొందిన వారంతా ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు చేస్తే తప్ప కొత్త నియామకాలు చేపట్టలేమని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఈ ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు హడావుడి జరిగినా, కోర్టు వివాదాల కారణంగా వాయిదా పడింది. 22వేల ఖాళీలు.. బోధనకు ఇబ్బంది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గతంలో విద్యాశాఖ అంచనా వేసింది. కానీ 12 వేల పోస్టులే ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యాయుల కొరతతో చాలా పాఠశాలల్లో బోధనకు ఇబ్బంది అవుతోంది. ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టిన నేపథ్యంలో ఈ సమస్య ఇంకా పెరిగింది. కొన్ని పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)లను ఉన్నత తరగతుల బోధనకు పంపుతున్నారు. కోర్టు వివాదాలకు దారితీసే రీతిలో విద్యాశాఖ వ్యవహరించడం వల్లే పదోన్నతులు, బదిలీలు ముందుకెళ్లడం లేదని.. టెట్ చేపట్టినా ఉపయోగం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. పోస్టుల భర్తీ లేకుండా టెట్ దేనికి? రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 22వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే లక్షల మంది టెట్ ఉత్తీర్ణులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు కల్పిస్తే నియామకాలు చేపట్టవచ్చు. ఇవేవీ చేయకుండా టెట్ చేపడితే ప్రయోజనం ఏమిటి? ప్రభుత్వం నియామకాలపై దృష్టి పెట్టాలి. – చావా రవి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
పది రోజుల్లో ఇంటర్ పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జూనియర్ కాలేజీలకు మరో పది రోజుల్లో ఇంటర్ పాఠ్య పుస్తకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, తెలుగు అకాడమీ డైరెక్టర్ దేవసేన తెలిపారు. ‘సాక్షి’ప్రతినిధితో సోమవారం ఆమె మాట్లాడుతూ.. పేపర్ కొరత కారణంగానే ముద్రణ ఆలస్యమైందన్నారు. ‘‘ఈ పుస్తకాలకు నాణ్యమైన పేపర్‌ను ఉపయోగిస్తాం. పేపర్ రేట్లు ఇటీవల విపరీతంగా పెరిగాయి. పాత కాంట్రాక్టు సంస్థల్లో ఒకటి మాత్రమే పేపర్ అందించడానికి ముందు కొచ్చింది. ప్రభుత్వం ఇటీవల వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంతో తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలకు డిమాండ్ పెరిగింది. దీంతో గతంలో వచ్చిన పేపర్ అవి ముద్రించడానికే ఉపయోగించాల్సి వచ్చింది. అవసరమైన పేపర్‌ను తెప్పించేందుకు అధికారులు సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రవాణాకు ఇబ్బంది ఏర్పడింది’’అని చెప్పారు. మార్కెట్లో ఖరీదుకు అందించే పుస్తకాలను ఇప్పటికే ముద్రించామని, ప్రభుత్వ కాలేజీలకు ఉచితంగా ఇవ్వాల్సిన పుస్తకాల్లో కొన్ని ముద్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పేపర్ అందిన మూడు రోజుల్లో ప్రింటింగ్ పూర్తి చేస్తామని తెలిపారు. తర్వాత వారం రోజుల్లో అన్ని కాలేజీలకు అందిస్తామన్నారు. పేపర్ కొరత సమస్య తెలంగాణకే కాదని, అన్ని రాష్ట్రాలకూ ఉందని వెల్లడించారు. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత అంతర్జాతీయంగానూ పేపర్ ఖరీదు పెరిగిందన్నారు. తాము టెండర్లు పిలిచినప్పటికి, ఇప్పటికి పేపర్ ఖరీదు రెట్టింపు అయిందని, అయినా నాణ్యత విషయంలో రాజీ పడకుండా విద్యార్థులకు మంచి పుస్తకాలు అందించాలనే సంకల్పంతో ఉన్నామని వివరించారు. -
పోలీస్: ‘దండం పెడుతా.. బయటకు రాకండి’
సాక్షి, ఇచ్చోడ(బోథ్): దండం పెట్టి చెబుతున్న అనవసరంగా బయట తిరగకండి అని ఇచ్చోడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న వారిని కానిస్టేబుల్ ప్రేంసింగ్ ఇలా దండం పెట్టి వేడుకున్నాడు. ఆదిలాబాద్ : జిల్లాలోని ఆదిలాబాద్ అర్బన్ ప్రాంతం, నేరడిగొండ, ఉట్నూర్ మండలాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం విధితమే. ఈ నేపథ్యంలో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంలో ఒక కిలో మీటర్ వరకు, మండల ప్రాంతంలో మూడు కిలో మీటర్ల రేడియస్‌లో ఈ దిగ్బంధం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే ఏరియాను పూర్తిగా దిగ్బంధం చేశారు. ఆదిలాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తాలో పోలీసుల బందోబస్తు డప దాటకుండానే.. ఈ కంటైన్మెంట్ జోన్లలో 19,541 ఇళ్లు ఉండగా, 72,666 మంది ప్రజలు ఉన్నారు. ఇందులో ఆదిలాబాద్‌లోనే 17,083 ఇళ్లు ఉండగా 63,587 మంది జనాభా ఉన్నారు. మిగితా ఇళ్లు, జనాభా నేరడిగొండ, ఉట్నూర్ మండల కంటైన్మెంట్ జోన్లలో ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఆ కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మెడిసిన్స్, ఇతర ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రంలోని 19 వార్డులకు ఒక్కొక్క స్పెషలాఫీసర్, ఒక అసిస్టెంట్‌ను నియమించింది. వార్డుల్లో గడప గడపకు కూరగాయలు సరఫరా చేసే విధంగా కొంత మంది కూరగాయలు విక్రయించే వ్యక్తులతో ఒప్పందం చేసుకుని వారి ఫోన్ నంబర్లను ప్రకటించారు. మరో ముగ్గురికి నెగిటివ్... జిల్లాలో మరో ముగ్గురికి నెగెటివ్ రావడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం వరకు 72 ఫలితాలు రాగా మరో ముగ్గురు ఫలితాలు శుక్రవారం వచ్చాయి. ఇక ప్రైమరీ కాంటాక్ట్‌లో మర్కజ్ నుంచి తిరిగి వచ్చిన వారికి సంబంధించి కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫలితాలు రావాల్సి ఉంది. ఈనెల 10వరకు జిల్లాలో పాజిటివ్ వచ్చిన 11మందిని గాంధీ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. నెగిటివ్ వచ్చిన 152 మందిని హోమ్ క్వారంటైన్‌కు గురువారం పంపించిన విషయం తెలిసిందే. ఇందులో మర్కజ్ నుంచి తిరిగి వచ్చిన 65 మందితో పాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ దేవసేన వార్డులకు గల్లీ వారియర్స్ ఆదిలాబాద్‌అర్బన్: ఆదిలాబాద్ పట్టణంలోని కంటైన్మెంట్ ఏరియాలో గల 19 వార్డుల్లోని ప్రజలకు నిత్యావసర సరుకులు, పాలు, మందులు గల్లీ వారియర్స్ ద్వారా ఇంటికే తీసుకెళ్లి ఇవ్వాలని, అన్ని వార్డులకు గల్లీ వారియర్స్‌ను నియమించాలని కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు.టీటీడీసీలో మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. అవసరమైన నిత్యావసరాలు గల్లీ వారియర్స్ ద్వారా ఇంటికే పంపాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే జోగు రామన్న, అదనపు ఎస్పీ వినోద్ కుమార్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డేవిడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కమిషనర్ మారుతి ప్రసాద్ ఉన్నారు. జిల్లాలో కరోనా వివరాలు.. మర్కజ్ నుంచి తిరిగి వచ్చిన వారు : 76 నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపినవి : 76 ఫలితాలు వచ్చినవి : 75 (ఈ సంఖ్యలో మూడు ఫలితాలు శుక్రవారం వచ్చినవి కలిపి) పాజిటివ్ : 10 నెగెటివ్ : 65 ఫలితాలు రావాల్సినవి : 01 ప్రైమరీ కాంటాక్ట్ వివరాలు.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల గుర్తింపు : 116 నమూనాలు సేకరించి పంపినవి : 116 ఫలితాలు వచ్చినవి : 88 పాజిటివ్ : 01 నెగెటివ్ : 87 ఫలితాలు రావల్సినవి : 28 -
కలెక్టర్ శ్రీదేవసేనకు అరుదైన గౌరవం
సాక్షి, ఆదిలాబాద్: జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనకు అరుదైన గౌరవం లభించింది. ఇప్పటివరకు నాలుగు జాతీయ స్థాయి అవార్డులు ఆమె సొంతం చేసుకున్నారు. మరోసారి సీఎంఓ వరల్డ్ సంస్థ ద్వారా ‘ద వరల్డ్ ఉమేన్ లీడర్షిప్’ అవార్డును మంగళవారం ముంబైలో ఆ సంస్థ నిర్వాహకుల చేతుల మీదుగా అందుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ, పల్లెప్రగతి, గ్రామాల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలకు ఈ అవార్డు దక్కింది. పెద్దపల్లి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించినందుకు మహిళ కలెక్టర్ల విభాగంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2018 సంవత్సరంలో పెద్దపల్లి జిల్లాలో 271 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం హైరిస్క్ డెంగీ జిల్లాగా ప్రకటించింది. ఉపాధిహామీ కింద ఉచితంగా ఇంకుడు గుంతలను నిర్మించడంతో దోమల నివారణ, వృథా నీరు పోకుండా భూగర్భజలాలు పెంపొందించేందుకు దోహదపడ్డాయని కలెక్టర్ తెలిపారు. కాగా 2019లో 85 శాతం కేసులు తగ్గాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లాను ఆదర్శంగా తీసుకోవాలని ప్రకటించినట్లు పేర్కొన్నారు. దేశంలోనే స్వచ్ఛత జిల్లాగా ప్రకటించారని గుర్తు చేశారు. కాగా అప్పట్లో ప్రధాని మోడీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛభారత్, స్వచ్ఛదర్పణ్ పథకాల కింద నాలుగు జాతీయ అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. అందరి సహకారంతో స్వచ్ఛతలో జిల్లాను ముందుంచుతానన్నారు. -
సీఎం సదస్సులో శ్రీదేవసేన
సాక్షి, ఆదిలాబాద్: గత రెండు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి, త్వరలో చేపట్టనున్న పట్టణ ప్రగతి, మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాలు, కొత్త రెవెన్యూ చట్టంపై సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సుకు కలెక్టర్ శ్రీదేవసేన హాజరయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో ఈ సదస్సు జరిగింది. -
అధికారులతో కలెక్టర్ శ్రీదేవసేన సమీక్ష!
సాక్షి, ఆదిలాబాద్: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, పథకాలను ప్రజల దరికి చేర్చే విషయంలో అధికారులు అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అంశాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి మొదటి సారి అధికారులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. కాగా, సీఎం కేసీఆర్ త్వరలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నందున అందులో ప్రస్తావించే అంశాలపై లోతుగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాను రెండు విధానాలను పాటిస్తానని, ఒకటి అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని, అధికారులు వివిధ అంశాలపై తప్పుడు సమాచారం ఇస్తే ఉపేక్షించేది లేదన్నారు. అనంతరం శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ముందుగా ఫారెస్ట్, గ్రామీణాభివృద్ధి, జిల్లాపరిషత్, పంచాయతీలలో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై చర్చించారు. ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు మాకు ఒక సైన్యం అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి అమలు చేసే బాధ్యత ఉన్న ఎంపీడీవోలను, ఎమ్మార్వోలను సైన్యం లాగా పరిగణిస్తామన్నారు. గ్రామాల్లో నర్సరీ పనులను పూర్తి చేసి మొక్కలు పెంపకానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడెక్కడ పనులు ప్రారంభించలేదో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు ఈనెల 10లోగా పూర్తి చేయాలన్నారు. డంపింగ్ యార్డు నిర్మాణాలు, శ్మశాన వాటికల నిర్మాణాలు పూర్తి చేయాలని, ఎక్కడెక్కడ ప్రారంభించలేదో అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా, కొన్ని నిర్మాణాలకు స్థలం సమస్య ఉండగా, మరికొని్నంటికీ ఫారెస్ట్ క్లియరెన్స్ సమస్య ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని గ్రామాల్లో మీ మార్కు ఉండాలని, ఇంకుడుగుంతలు నిర్మించాలని, 12వేల మరుగుదొడ్లను మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఇందులో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలని, మండల ప్రత్యేక అధికారులు ఇన్వాల్వ్ కావాలన్నారు. ప్రతీ శుక్రవారం స్వచ్ఛశుక్రవారం నిర్వహించేలా నిర్ణయం తీసుకుంటామని, దీంతో కొత్త విషయాలు తెలుస్తాయన్నారు. అంతకు ముందు కలెక్టరేట్లోని వివిధ విభాగాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్వో నటరాజ్, ఆర్డీవో సూర్యనారాయణ, జెడ్పీసీఈవో కిషన్, డీఆర్డీవో రాజేశ్వర్, డీఎఫ్‌వో ప్రభాకర్, డీఎంహెచ్‌వో చందు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇలా వచ్చారు.. అలా వెళ్లారు!
సాక్షి, ఆదిలాబాద్: కొత్త జిల్లా కలెక్టర్ దేవసేన సోమవారం సాయంత్రం 7గంటల తర్వాత బాధ్యతలు స్వీకరించాక కొద్దిసేపు మాత్రమే జిల్లాలో ఉన్నారు. అనంతరం ఆమె తిరుగు ప్రయాణం అయ్యారు. రెండుమూడు రోజుల పాటు కలెక్టర్ జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండరని కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది పేర్కొంటున్నారు. సాధారణంగా కొత్త కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మరుసటి రోజు వివిధ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలుస్తారు. అయితే మంగళవారం అందుబాటులో లేకపోవడంతో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఎలాంటి సందడి కనబడలేదు. సోమవారం రాత్రి కొద్దిసేపు మాత్రమే జిల్లాలో ఉన్న ఆమె హైదరాబాద్‌కు పయనమయ్యారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బదిలీల కంటే ముందు ఆమె హైదరాబాద్‌కు బదిలీ కోసం ప్రయత్నించారని సమాచారం. అయినప్పటికీ ఆదిలాబాద్‌లో పోస్టింగ్ ఇవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా బదిలీ అయిన కలెక్టర్లు వెనువెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఆమె సోమవారం సాయంత్రమే ఇక్కడికి వచ్చి విధుల్లో చేరారు. హైదరాబాద్‌కు చెందిన అల్లమరాజు దేవసేన పరిపాలన విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించడంతోపాటు ప్రజాసమస్యలు నేరుగా తెలుసుకొని పరిష్కరించగల తత్వం కలిగి ఉన్నారు. 1997లో గ్రూప్–1కు ఎంపికయ్యారు. హైదరాబాద్ ఆర్డీఓగా, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. 2008లో కన్ఫర్డ్ ఐఏఎస్ అయ్యారు. అటుపై సెర్ప్ డైరెక్టర్‌గా, ఎన్నికల కమిషన్ డిప్యూటీ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత కరీంనగర్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. జిల్లాల పునర్విభజనతో కొత్త జిల్లాగా ఏర్పడిన జనగామ జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు. అక్కడ ఏడాదిపైగా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. జనగామ కలెక్టర్‌గా ఉన్న సమయంలో భూ సంబంధిత వ్యవహారాల్లో అక్కడి అధికార పార్టీ ప్రజాప్రతినిధిని ఎదురించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారనే పేరుంది. దేవసేన 2018 జనవరిలో పెద్దపల్లి కలెక్టర్‌గా వెళ్లారు. అక్కడ ఏడాదికిపైగా పనిచేశారు. ఆమె కృషి ఫలితానికి మూడు జాతీయ అవార్డులూ వరించాయి. -
కలెక్టర్ శ్రీదేవసేనకు గవర్నర్ లేఖ
సాక్షి,పెద్దపల్లి: ‘జిల్లాలో నా పర్యటన సందర్భంగా మీరు, మీ జిల్లా అధికారులు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మీ ఆతిథ్యం ఆకట్టుకుంది’ అని రాష్ట్ర గవర్నర్ తమిళసై జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనను అభినందిస్తూ శుక్రవారం లేఖ రాశారు. విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం, స్వీయరక్షణను పెంపొందించడానికి నేర్పిస్తున్న మార్షల్ ఆర్ట్స్ శిక్షణ, బట్టబ్యాగుల తయారీ, సబల నాప్కిన్స్ తయారీ గురించి ప్రముఖంగా లేఖలో ప్రస్తావించారు. నందిమేడారం వద్ద నిర్మించిన కాళేశ్వరం ప్యాకేజ్–6 సందర్శించడంపై ఆనందం వ్యక్తం చేశారు. -
మేడం వచ్చారు..
సాక్షి , కరీంనగర్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన అనంతరం మంగళవారం సాయంత్రం రామగుండం ఎన్టీపీసీ గెస్ట్‌హౌజ్‌కు చేరుకున్న గవర్నర్‌కు ఘన స్వాగతం లభించింది. ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ గవర్నర్‌కు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. మంగళవారం రాత్రి గవర్నర్ అక్కడే బస చేస్తారు. కాగా బుధవారం ఉదయం నుంచి పెద్దపల్లి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రామగుండం, బసంత్‌నగర్, పెద్దపల్లిలో నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 12 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు 6వ ప్యాకేజీలో భాగంగా ధర్మారం మండలం నందిమేడారం చేరుకుంటారు. నందిమేడారంలో మధ్యాహ్న భోజనం మధ్యాహ్నం 12 గంటలకు నందిమేడారం చేరుకోనున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ 2.30 గంటల వరకు అక్కడే గడుపనున్నారు. ఈ సందర్భంగా నంది పంప్‌హౌజ్‌ను సందర్శిస్తారు. గవర్నర్ మేడం రాక కోసం నంది మేడారం పంప్‌హౌజ్‌ను సుందరంగా ముస్తాము చేశారు. ధర్మారం– పెద్దపల్లి మెయిన్ రోడ్డు గేట్ నుంచి టన్నెల్ వరకు నిర్మించిన సీసీ రోడ్డును శుభ్రం చేశారు. క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎలాంటి స్క్రాప్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్యాకేజీ 6లోని పంప్‌హౌజ్‌లో గవర్నర్‌కు ప్రాజెక్టు గురించి వివరించేందుకు ప్రెజెంటేషన్ మ్యాప్‌లను సిద్ధం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు స్వాగతం పలుకుతున్న అధికారులు టన్నెల్ పై భాగంలో హైమాస్ట్ బల్బులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అండర్‌గ్రౌండ్‌లోని 7 పంప్‌లను పూలతో అలంకరించారు. సబ్‌స్టేషన్, అక్సెస్ టన్నెల్, సర్జిఫూల్ల వద్ద పూర్తిస్థాయిలో రక్షణ ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్టు ఈఈ నూనె శ్రీధర్ ఆధ్వర్యంలో ఏఈ ఉపేందర్, నవయుగ కంపెనీ డైరెక్టర్ రామారావు, ఏజీ శ్రీనివాస్, డీపీఎం రంగబాబులు దగ్గరుండి పనులు పూర్తి చేయించారు. మధ్యాహ్నం 1.30 గంటల తరువాత ఇక్కడే భోజనం పూర్తిచేసి 2.30 గంటలకు హైదరాబాద్ పయనమవుతారు. కరీంనగర్లో స్మాల్ బ్రేక్ నందిమేడారంలో నంది పంపుహౌజ్‌ల సందర్శన అనంతరం 3.15 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కరీంనగర్ చేరుకుంటారు. ఎల్ఎండీ వద్ద గల ఎస్ఆర్ఎస్పీ గెస్ట్‌హౌజ్‌లో కొద్దిసేపు సేదతీరుతారు. ఈ మేరకు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎల్ఎండీ గెస్ట్‌హౌజ్ నుంచి సాయంత్రం 3.45 గంటలకు గవర్నర్ హైదరాబాద్ బయలు దేరుతారు. ఘన స్వాగతం గోదావరిఖని(రామగుండం): గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం రాత్రి రామగుండం ఎన్టీపీసీ చేరుకున్నారు. అన్నారం సరస్వతి బ్యారేజీ సందర్శించిన తర్వాత రోడ్డు మార్గం ద్వారా మంచిర్యాల జిల్లా చెన్నూరు మీదుగా గోదావరిబ్రిడ్జిపై నుంచి రామగుండం ఎన్టీపీసీకి వచ్చారు. ముందుగా అనుకున్న ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన తర్వాత మంథని మీదుగా గోదావరిఖని చేరుకోవాల్సి ఉండగా రోడ్డు సరిగా లేకపోవడంతో గవర్నర్ ప్రయాణించే రూట్ మార్చారు. అన్నారం బ్యారేజీ పరిశీలించిన తర్వాత చెన్నూరు మండలం సుందరశాల మీదుగా చెన్నూరు, భీమారం, జైపూర్ మీదుగా గోదావరిఖని చేరేలా ఏర్పాటు చేశారు. నేటి పర్యటన వివరాలు.. ♦ ఉదయం 8 గంటలకు: ఎన్టీపీసీ స్పందన క్లబ్లో బాలికల కరాటే పోటీల సందర్శన ♦ ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు: గోదావరిఖని శారదానగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళరీపయట్టు కరాటే ప్రదర్శన ♦ ఉదయం 9.45 నుంచి 10.15 గంటల వరకు: బసంత్‌నగర్ రూట్లో రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్ సందర్శన ♦ ఉదయం 10.15 నుంచి 10.30 గంటల వరకు: బసంత్‌నగర్‌లోని ఎస్‌హెచ్‌జీ ఉమెన్స్ తయారు చేసిన జ్యూట్ బ్యాగుల కేంద్రం సందర్శన ♦ ఉదయం 10.30 నుంచి 10.45 వరకు: మహిళా స్వయం సహాయక బృందాల ఆధ్వర ్యంలో సబల శానిటరీ నాపికిన్స్ తయారు కేంద్రం పరిశీలన ♦ ఉదయం 10.45 నుంచి 12 గంటల వరకు: ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్వగ్రామం కాసులపల్లి గ్రామంలో స్వచ్చత పరిశీలన ♦ 12 నుంచి 12.30 గంటల వరకు:కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ధర్మారం మండలంలోని నందిమేడారం 6వ ప్యాకేజీ ప్రాజెక్టు సందర్శనకు ప్రయాణం ♦ 12.30 నుంచి 1.30 గంటల వరకు: 6వ ప్యాకేజీ పరిశీలన ♦ 1.30 నుంచి 2.30 గంటల వరకు: 6వ ప్యాకేజీ వద్ద భోజన ఏర్పాట్లు ♦ 2.30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం -
కేజీ ప్లాస్టిక్‌కు కిలో బియ్యం
సాక్షి, పెద్దపల్లి : ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కేజీ ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకుని కిలో బియ్యం అందించేందుకు రైస్‌మిల్లర్లు సహకరించాలని కలెక్టర్ శ్రీదేవసేన సూచించారు. పర్యావరణానికి, భూగర్భ జలాల పెంపునకు ఆటంకం కలిగించే సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించామని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘మా గృహం స్వచ్ఛ గృహం, ప్లాస్టిక్ నిర్మూలన అంశాలపై జిల్లా రైస్‌మిల్లర్లు, పెట్రోల్ బంక్ డీలర్లతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛత పరిశుభ్రతకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డంపింగ్‌యార్డు, శ్మశానవాటికల నిర్మా ణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లోని స్వశక్తి మహిళలకు ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ నిర్వహణ బాధ్యతలను అప్పగించడంతోపాటు అవసరమైన శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. జాతీయస్థాయిలో స్వచ్ఛతలో ఉత్తమ జిల్లాగా కీర్తి గడిచిన పెద్దపల్లిని అదేస్థాయిలో నిలిపేందుకు రైస్‌మిల్లర్లు, పెట్రోల్‌బంక్ డీలర్లు సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకుని కేజీ ప్లాస్టిక్‌కు కిలో బియ్యం అందించాలని కలెక్టర్ కోరగా రైస్‌మిల్లర్ల ప్రతినిధులు అందుకు అంగీకరించారు. అనంతరం జాతీయస్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకవచ్చిన జిల్లా కలెక్టర్‌ను రైస్‌మిల్లర్లు, పెట్రోల్‌బంకుల ప్రతినిధులు సత్కరించారు. కార్యక్రమంలో జేసీ వనజాదేవి, జిల్లా ఫౌరసరఫరాల అధికారి వెంకటేశ్, సివిల్సప్లై జిల్లా మేనేజర్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
కొలువుదీరిన కొత్త జెడ్పీ
సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా పరిషత్ పాలకవర్గం శుక్రవారం కొలువుదీరింది. నూతనంగా ఎంపిక చేసిన జిల్లాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేదర్, కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారీ సమక్షంలో కమాన్‌పూర్ జెడ్పీటీసీ పుట్టమధుతో కలెక్టర్ శ్రీదేవసేన జెడ్పీ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేయించారు. దైవసాక్షిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని మధు ప్రమాణం చేశారు. అనంతరం వైస్ చైర్పర్సన్ మండిగ రేణుకతో కలెక్టర్ ప్రమాణస్వీకారం చేయించారు. తర్వాత 9 మంది జెడ్పీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. జెడ్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు.. పెద్దపల్లిలోని రైల్వేస్టేషన్ సమీపంలోని నూతన జిల్లాపరిషత్ కార్యాలయాన్ని మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ మొదట ప్రారంభించారు. అనంతరం జోడ్పీ చైర్మన్, వైస్‌చైర్‌పర్సన్‌తోపాటు 9 మంది సభ్యులు ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు పుట్టమధును ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రుల సమక్షంలో జెడ్పీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించి కుర్చీలో కూర్చున్నారు. అనంతరం నాయకులు కార్యకర్తలు గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, టీఎస్టీఎస్ చైర్మన్ రాకేష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, జాయింట్ కలెక్టర్ వనజాదేవి, పోలీస్‌హౌసింగ్‌బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి సీఈవో వినోద్‌కుమార్, పంచాయితీ అధికారి సుదర్శన్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. సమాజానికి మేలు చేసే నాయకుడు.. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి జెడ్పీ చైర్మన్ పుట్టమధు సమాజానికి మేలు చేసే నాయకుడిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి కావడానికి భూసేకరణ సమయంలో ఎమ్మెల్యేగా పుట్టమధు పాత్రను గుర్తు చేశారు. ప్రజలు మెచ్చిన నాయకుడిగా కేసీఆర్ గుర్తించి అవకాశం కల్పించారన్నారు. స్వచ్ఛ జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈసందర్భంగా ఎమ్మెల్యే కోరారు. రాష్ట్రంలో అన్నింటి కంటే ముందు పెద్దపల్లి జిల్లా స్వచ్ఛ జిల్లాగా ఏర్పాటవుతుందనే ధీమా వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో ఉంటే అవకాశాలెన్నో..ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజల మధ్య ఉన్న నాయకులకు అవకాశాలు ఎదురుగా వస్తాయని పుట్టమధు ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా రాష్ట్రాన్ని సాధించడంతోపాటు అదే స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే శాసనసభ్యులుగా, జెడ్పీ చైర్మన్లుగా ఎన్నికయ్యారన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలమైంది.. ఈదశంకర్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్ 1952లో మొదలైన పంచాయతీరాజ్ చట్టం వివిధ కోణాల్లో బలోపేతం చేశారన్నారు. గాంధీజయంతి రోజు ఆరంభించిన పంచాయతీరాజ్ వ్యవస్థలో 30 లక్షల మంది ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారని ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి అన్నారు. మూడంచెల విధానంతో దేశంలో 2,34,674 గ్రామపంచాయతీలు, సమితులు, మండలాలు, జిల్లా పరిషత్‌లు ప్రజలకు సేవలందిస్తున్నయన్నారు. ఇలాంటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీరాజ్ వ్యవస్థకు మరింత పదును పెట్టారన్నారు. కార్యక్రమంలో చిరుమల్ల రాకేశ్, జెడ్పీ వైస్‌చైర్మన్ మండిగ రేణుక, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్‌సింగ్, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి సుదర్శన్, జిల్లాలోని జెడ్పీపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలే దేవుళ్లు.. జెడ్పీ చైర్మన్ పుట్టమధు తనకు అమ్మ నాన్నలు ఎలా ఉంటారో తెలియదు.. బాల్యంలోనే వారిని కోల్పోయిన నాకు ప్రజలే అమ్మానాన్న, దేవుళ్లు అని జెడ్పీ చైర్మన్ పుట్టమధు అన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పుట్టమధు మాట్లాడారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తాను పేదరికాన్ని చూశానన్నారు. అన్న య్య సహకారంతో పెరిగి పెద్దయ్యాను. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చేరి జెండా మోసి ఇప్పుడు జెడ్పీ చైర్మన్‌గా జనం ఆదరణతో ఎన్నికయ్యానని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి ముందు వరుసలో ఉంటానని తెలిపారు. పెద్దపల్లి జిల్లాను ప్రగతిపథంలో నడిపించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశం, జనం దీవెనలతో వచ్చిన పదవిని ప్రజాసేవకే ఉపయోగిస్తానని స్పష్టం చేశారు. -
ప్రచారం చేయొద్దు...
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తున్న రీసోర్స్ పర్సన్స్ (ఆర్పీ)లు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహిళా సంఘాలకు ప్రాతినిథ్యం వహించే ఆర్పీల ఎన్నికల ప్రచారంపై స్పష్టతనిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ జీవో జారీ చేశారు. దీంతో ఆర్పీలను రాజకీయ ప్రచారం కోసం వాడుకోవాలా..వద్దా... అనే వివాదానికి తెరపడింది. సాక్షి, పెద్దపల్లి: ఆర్పీలను ఎన్నికల ప్రచారంలో వాడుకొనే వ్యవహారంలో రామగుండం నియోజకవర్గంలో నెలకొన్న వివాదం, ఈ స్పష్టతకు దారితీసింది. ఈ నెల 2న రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీదేవసేనతో టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ ఆర్పీల విషయంపై వాదనకు దిగారు. నిబంధనల పేరిట తన ప్రచారానికి అధికారులు అడ్డుపడుతున్నారని అసహనం వ్యక్తంచేశారు. ప్రచారానికి ఆర్పీలను వాడుకోవడంలో ఎందుకు అభ్యంతరం చెబుతున్నారంటూ ప్రశ్నించారు. ఆర్పీల విషయాన్ని ఎన్నికల సంఘానికి నివేదిస్తామని, రాష్ట్ర ఎన్నికల అధికారి నుంచి వచ్చిన వివరణ మేరకే స్పందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. అప్పటి వరకు మెప్మా విభాగంలో పనిచేస్తున్న రీసోర్స్ పర్సన్స్ ఏ రాజకీయ పార్టీకి కాని, అభ్యర్థులకు అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ప్రకటించారు. ఈ నెల 3న ఇదే విషయంపై రాష్ట్ర ఎన్నికల అధికారికి కలెక్టర్ నివేదిక పంపించారు. స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్‌కుమార్ ఈనెల 9న వివరణ ఇచ్చారు. రీసోర్స్ పర్సన్స్ ఎవరికి అనుకూలంగా కూడా ప్రచా రం చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. ఊపిరి పీల్చుకున్న ఆర్పీలు గంపగుత్త ఓట్ల కోసం మహిళా సంఘాలను ప్రభావితం చేయడం అభ్యర్థులకు ఎన్నికల్లో కొత్త కాదు. ఎన్నికల ప్రచారంలో, ఓట్లల్లో మహిళా సంఘాలు కీలకం కావడంతో నేతలంతా గ్రూప్‌లపైనే దృష్టి పెడుతారు. ఈ క్రమంలోనే మహిళా సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్పీలపై కొంతమంది అభ్యర్థులు ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. తమ ద్వారానే ఉద్యోగాలు పొందారని, తమకు ప్రచారం చేయకపోతే మీ సంగతి తేల్చుతామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న ఎన్నికల సంఘం ఆర్పీల ఎన్నికల ప్రచారంపైనా స్పష్టత ఇచ్చింది. -
‘దేశంలోనే పెద్దపులి ఈ జిల్లా’
సాక్షి, పెద్దపల్లి : స్వచ్ఛ భారత్ మిషన్ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ కేంద్రంలో స్వచ్ఛతా దివాస్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించింది. ఇందులో భాగంగా కేంద్ర పారిశుద్ధ్య శాఖా మంత్రి ఉమాభారతి స్వచ్చ్ సర్వేక్షణ్ గ్రామీణ్ 2018 అవార్డులను ప్రదానం చేశారు. కాగా స్వచ్చతాలో 97.45 పాయింట్లతో దేశంలో మూడో స్థానం, దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దపల్లికి మొదటి స్థానం దక్కడం పట్ల కలెక్టర్ దేవసేన ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడుతూ.. రెండు అవార్డులు దక్కించుకుని పెద్దపల్లి జిల్లా దేశంలో పెద్దపులి లాంటి జిల్లాగా నిరూపించుకోవడం గర్వంగా ఉందన్నారు. స్వచ్చతా విషయంలో జిల్లాలో అనేక సంస్కరణలు చేపట్టామని ఆమె తెలిపారు. ప్రతి శుక్రవారం స్వచ్చ్ వారాన్ని ఏర్పాటు చేసి స్వచ్చతాను పెంపొందిస్తున్నామన్నారు. గ్రామాల్లో, ముఖ్య కూడళ్లలో చెత్తా చెదారం లేకుండా చేయడం ద్వారా దోమలను అరికట్టగలిగి, అంటు వ్యాధులను కొంత వరకు నిరోధించగలిగామని పేర్కొన్నారు. మహిళల కోసం సబల కార్యక్రమం.. మహిళల కోసం ‘సబల’ పేరుతో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని దేవసేన తెలిపారు. రుతుక్రమ సమయంలో నార్మల్ ప్యాడ్ల వాడకం వల్ల గ్రామీణ స్థాయిలో మహిళలు గర్భసంచి, జ్ఞానేంద్రియాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలను నివారించేందుకు సబల ప్యాడ్లను తయారు చేస్తున్నామన్నారు. ఇందుకోసం కలెక్టర్ నిధుల నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ప్యాడ్లను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ ప్యాడ్లు పూర్తిగా పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా తయారు చేస్తున్నట్లు దేవసేన పేర్కొన్నారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అగ్రగామిగా నిలపండి
పెద్దపల్లిఅర్బన్ : స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లాను అగ్రగామిగా నిలిపేం దుకు అన్ని శాఖల అధికారులు సమష్టిగా పని చేయాలని కలెక్టర్ శ్రీదేవసేన ఆదేశించారు. పెద్దపల్లి మండలం బందంపల్లి స్వరూప గార్డెన్స్‌లో స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్‌పై ప్రత్యేక అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, వీఓలు, సం బంధిత సిబ్బందికి బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 208 గ్రామపంచాయతీలకు అదనంగా మరో 65 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయన్నారు. గురువారం నుంచి ప్రత్యే క అధికారుల పాలన ప్రారంభమవుతుందని, ఇందుకోసం అవసరమైన ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. గ్రామపంచాయతీలలో సేవలను పారదర్శకంగా అందించేందుకు భవనాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త పంచాయతీలలో పండుగ వాతావరణం క ల్పించేలా ప్రజలతో మమేకమై సేవలందించాలని పేర్కొన్నారు. ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, పరిసరాల పరిశుభ్రత పాటించేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ స్వచ్ఛత వైపు అడుగులు వేయించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అధికారుల ని రంతర కృషి ఫలితంగా ప్రతీ కుటుంబానికి మరుగుదొడ్డి నిర్మించి ఏడాది క్రితమే ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించారని, దీనిని సుస్థిర పరిచే దిశగా ఓడీఎఫ్ ప్లస్ కార్యక్రమం నిర్వహించాలని జిల్లాలో స్వచ్ఛత రథ్ ద్వారా ప్రతీ గ్రామంలో పారిశుధ్యం, మరుగుదొడ్డి ఉపయోగంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు వివరించారు. ఆగస్టు 15 వరకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన బృందాలు దేశవ్యాప్తంగా ఓడీఎఫ్‌గా ప్రకటించుకున్న 118 జిల్లాల్లో పర్యటించి, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ పథ కం కింద చేసిన పనులను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. దీనికి గ్రామ ప్రత్యేక అధికారులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. 118 ఓడీఎఫ్ జిల్లాల్లో పెద్దపల్లిని ప్రథమ స్థానంలో ఉంచేలా పని చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎస్ఎస్జీ యాప్‌లో సమాధానాలు జిల్లాలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎస్ఎస్జీ 18 అనే యాప్‌ను గూగూల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి, జిల్లా స్వచ్ఛతకు సంబంధించి ప్రశ్నలకు సమాధానాలు అందించాలన్నారు. కేంద్ర బృందం గ్రామాల్లో పర్యటించినపుడు గ్రామపంచాయతీ కార్యదర్శులను, ప్రత్యేక అధికారులను, అంగన్వాడీ టీచర్లను, ఏఎన్ఎంలను స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్‌లో భాగంగా జిల్లాలో చేసిన కార్యక్రమాలపై వివరాలు అడుగుతారని, సమర్ధవంతంగా సమాధానం ఇవ్వాలన్నారు. స్వచ్ఛతకు పెద్దపీట జిల్లాలో ట్రీగరింగ్, అవగాహన కార్యక్రమాలు, ఓడీఎఫ్ ప్లస్ కార్యక్రమాలపై కేంద్ర బృందం ప్రత్యేక దృష్టి సారిస్తున్నందున వాటిపై సమగ్ర కార్యాచరణతో సిద్ధంగా ఉండాలన్నారు. గ్రామాల్లోని పంచాయతీ భవనం, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలు, స్వశక్తి భవనాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించి, అక్కడ ఉన్న మరుగుదొడ్లను, నీటి లభ్యత, మరుగుదొడ్ల వాడకాన్ని పరిశీలించి, 30 మార్కులు కేటాయిస్తారని పేర్కొన్నారు. అవసరమైన చోట తగిన సూచనలు, దిద్దుబాటు చర్యలు చేయాలన్నారు. చెత్తబుట్టలను కొనుగోలు చేసి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా మహిళలు నెలసరి సమయంలో న్యాప్కిన్లు ఉపయోగించేలా చూడాలని సూచించారు. ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో చేపట్టనున్నందున శస్త్రచికిత్సలు అవసరమైన వారిని గుర్తించి, జాబితాను సిద్ధం చేయాలని, క్యాంపు వివరాలను ప్రజలకు వివరించేలా ప్రచారం నిర్వహించాలన్నారు. కంటి వెలుగు పథకంలో భాగంగా తగిన వైద్యులు, సిబ్బంది కళ్లద్దాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో నరేగా నిధులను ఉపయోగించి స్మశాన వాటికలను నిర్మించేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలన్నారు. సమావేశంలో జేసీ వనజాదేవి, ఇన్చార్జి డీఆర్డీవో ప్రేమ్‌కుమార్, డీపీవో సుదర్శన్, డీఎంహెచ్‌వో ప్రమోద్, అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
నా తప్పుంటే చర్యలు తీసుకోవచ్చు: ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్ : జనగాం జిల్లాలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై ఇరువురి మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. బతుకమ్మ కుంట విషయంలో తన తప్పు ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చునని ఆయన చెప్పారు. ఈ అంశంపై మంగళవారం సచివాలయంలో సీఎస్ ఎస్పీ సింగ్‌ను ముత్తిరెడ్డి కలిసి అక్కడి పరిస్థితులపై నివేదిక ఇచ్చారు. అనంతరం సచివాలయం మీడియా పాయింట్ మాట్లాడుతూ... బతుకమ్మ కుంట కబ్జాకు గురికాకుండా ఉండాలనే గోడ కట్టామన్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి కమిటీ వేయలేదన్నారు. జనగామ చెరువు సుందరీకరణకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందన్నారు. అఖిల పక్షం కమిటీ సూచన మేరకే స్థానికుల సౌకర్యం కోసం చెరువు అభివృద్ధి చేశామన్నారు. కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని, కలెక్టర్ ప్రభుత్వాన్ని బదునాం చేస్తున్నారని తెలిపారు. అనుభవంలేని కలెక్టర్ వల్లే ఈ సమస్య అని, పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని, ప్రభుత్వ ఆలోచనలకు విరుద్ధంగా కలెక్టర్ పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎందుకు కలెక్టర్‌పై చర్యలు తీసుకోవడంలేదని విలేకరుల ప్రశ్నించగా, అందుకు తగిన సమయం రావాలన్నారు. ఇప్పటికే ఈ అంశంపై సీఎస్‌కు ఫిర్యాదు చేశామన్నారు. -
భళిరా.. భళీ..!
మీరు బాహుబలి సినిమా చూశారా? అందులో భల్లాలదేవ పాత్రధారి రాణా.. తల్లి పాత్రధారి రమ్యకృష్ణకు కుంతలదేశ యువరాణి పాత్రధారి అనుష్క చిత్రాన్ని చూపించే సన్నివేశం గుర్తుందా? ఆ చిత్రాన్ని గీసింది ఎవరో కాదు. మన తణుకు చిన్నారే.. పేరు ప్రిన్స్ విజయన్. తణుకు టౌన్ : తిరిగిపల్లి ప్రిన్స్ విజయన్ ప్రస్తుతం తణుకులోని శశి ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి రాజేంద్రకుమార్ గతంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో ప్రిన్స్ కుటుంబం హైదరాబాద్‌లో నివసించేది. అప్పట్లో హైదరాబాద్ ఎన్ఎంఆర్ పాఠశాలలో ప్రిన్స్ చదివేవాడు. కార్టూన్ చానల్స్ ఎక్కువగా చూడడం వల్ల అతనికి చిత్రలేఖనంపై ఆసక్తి కలిగింది. 2013 ఆగస్టులో అతను ఐదో తరగతి చదువుతుండగా, బాహుబలి చిత్ర బృందం ‘బాహుబలి లాస్ట్ లెసన్స్’ అనే పేరుతో చిత్రంలో కుంతల దేశ యువరాణి దేవసేనకు ఎటువంటి ఆభరణాలు ఉండాలి అనే అంశంపై విద్యార్థులకు చిత్ర లేఖనం పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో మొత్తం 65 మంది పాల్గొనగా 12 మంది ఎంపికయ్యారు. వీరిలో నుంచి నలుగురిని చిత్రబృందం ఎంపిక చేసింది. వీరిలో ముగ్గురు ఉత్తరాది వారు కాగా.. నాలుగో వ్యక్తి ప్రిన్స్. ఈ నలుగురికీ మరోమారు రామోజీఫిలిం సిటీలో పోటీ పెట్టడానికి 2013 సెప్టెంబరు 14న విజయన్‌కు సెలవు ఇవ్వాలని కోరుతూ స్వయంగా బాహుబలి చిత్రబృందం ఎన్ఎంఆర్ స్కూల్‌కు లేఖను కూడా రాసింది. అప్పట్లో మంచి చిత్రాలు గీసిన విజయన్ ఆ తర్వాత తణుకు వచ్చేయడంతో వాటి గురించి మరిచిపోయాడు. విజయన్ చిత్రం బాహుబలిలో విజయన్ చిత్రం ఉండడంతో.. ఆ బొమ్మ గీసింది ఎవరని ఓ తమిళ టీవీ విచారణ చేసింది. అది విజయన్ అని తెలియడంతో ఆ టీవీ బృందం తణుకు వచ్చి విజయన్ను ఇంటర్వూ్య చేసింది. బాహుబలిలో చూపించిన చిత్రం కింద విజయన్ పేరుపై పెయింట్ వేశారు. దీంతో అది విజయన్ చిత్రమని తెలియకుండా పోయింది. తమిళ టీవీ ప్రతినిధులు ఫోన్ చేసే వరకూ చిత్రంలో వాడింది తను వేసిన బొమ్మేనని తెలియలేదని ప్రిన్స్ పేర్కొన్నారు. ఆ తర్వాత చిత్ర యూనిట్‌కు ఫోన్ చేస్తే చిత్ర పబ్లిసిటీ డిజైనర్ సెంథిల్‌కుమార్ క్యూబా వెళ్లారని, మీ బొమ్మ గురించి తెలియదని వివరించారు. కుటుంబ నేపథ్యం ఇదీ.. విజయన్ తండ్రి రాజేంద్రకుమార్‌ది తాళ్లపూడి మండలం పెద్దేవం . తల్లి సునీతది కృష్ణా జిల్లా మచిలీపట్నం. సునీత తండ్రి కాటూరి జశ్వంత్బాబు తణుకు ఆంధ్రా సుగర్స్‌లో ల్యాబ్ సూపరింటెండెంట్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. రాజేంద్ర కుమార్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం మానేసి విదేశాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం కుటుంబంతో సంబంధం లేకుండా ఉన్నారు. దీంతో విజయన్ తల్లి సునీత తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ తన ఇద్దరి పిల్లలను తణుకులో చదివిస్తున్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. బహుభాషా ప్రావీణ్యం విజయన్ ఎక్కువ కాలం హైదరాబాద్‌లోని కార్పొరేట్ స్కూల్లో చదవడంతో వివిధ రాష్ట్రాల విద్యార్థులతో ఏర్పడిన పరిచయం వల్ల ఎక్కువ భాషల్లో ప్రావీణ్యం సాధించాడు. అతను ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్తో పాటు తమిళం, కన్నడ, మళయాళం, కొంకణి, స్పానిష్ భాషలు మాట్లాడగలడు. తమిళ చానల్ తన గురించి ప్రసారం చేయడంతో రాజుగారి గది–2 చిత్రం యూనిట్‌లోని పలువురు తనతో మాట్లాడారని విజయన్ తెలిపారు. తమిళ చానల్ వచ్చేవరకూ తెలీదు : తల్లి సునీత తణుకులోని మా అపార్ట్‌మెంట్‌ను వెతుక్కుని తమిళ చానల్ ప్రతినిధులు వచ్చే వరకూ బాహుబలి చిత్రానికి ఫొటోలు వేసింది మా బిడ్డేనని తెలియదని విజయన్ తల్లి సునీత చెప్పారు. ఎప్పుడూ వివిధ భాషలలో ఎవరెవరితోనో మాట్లాడుతుంటే హైదరాబాద్‌లో ఉండే తన మిత్రులతోనేమో అనుకునేవాళ్లమని, తరగతి పుస్తకాల్లో పెన్సిల్‌తో వేసే బొమ్మలు పిచ్చి బొమ్మల్లాగే కన్పించేవని, తీరా చేస్తే బాహుబలి చిత్రంలో అనుష్క ఫొటోలు వివిధ ఆకృతులలో కన్పించాయని ఆమె వివరించారు. -
నాడు జేసీ.. నేడు కలెక్టర్
బతుకమ్మ కుంట వివాదం చిలిచిలికి గాలివానలా మారుతోంది. గతంలో ఈ కుంట వ్యవహారంలో అప్పటి ఉమ్మడి జిల్లా జేసీ, ప్రస్తుతం వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో వివాదంలో చిక్కిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. తాజాగా మరోమారు కలెక్టర్ శ్రీదేవసేన చేసిన వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. అయితే కలెక్టర్ చేసిన ఆరోపణలపై ముత్తిరెడ్డి సీఎస్‌కు ఫిర్యాదు చేయడం, కలెక్టర్‌కు ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలపడం వంటి ఘటనలతో ఈ వివాదం కొత్త మలుపులు తిరుగుతుంది. సాక్షి, జనగామ : కలెక్టర్ శ్రీదేసేన, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య తలెత్తిన బతుకమ్మ కుంట బేధాభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కుంటలోని శిఖం భూమిని స్వయంగా ఎమ్మెల్యే కబ్జా చేశారని కలెక్టర్‌గా ప్రకటించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇదిలా ఉంటే కలెక్టర్‌పై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రభుత్వ ఛీప్ విప్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అంతే కాకుండా అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కలెక్టర్ వ్యవహరించారని వివరించినట్లు సమాచారం. ఈ వరుస ఘటనలతో బతుకమ్మ కుంట వివాదం మరింత జఠిలం మారుతోంది. అయితే కలెక్టర్‌కు మాత్రం సీపీఐ, సీపీఎం, టీడీపీ, బీజేపీ, ప్రజాఫ్రంట్ నాయకులు అండగా నిలిచారు. నాడు పనులకు అడ్డు చెప్పిన జేసీ.. జనగామ ఎమ్మెల్యే, కలెక్టర్ మధ్య వివాదానికి కారణమైన బతుకమ్మ కుంట మరోసారి వార్తలెక్కింది. గతంలో బతుకమ్మ కుంట వివాదంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పరువు పోయింది. సూర్యాపేట రోడ్డులో ఉన్న ధర్మోనికుంట ప్రస్తుత బతుకమ్మ కుంటను 2015లో మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు రెడీ చేసి ప్రభుత్వానికి పంపించారు. దీంతో అప్పటి ఉమ్మడి జాయింట్ కలెక్టర్, ప్రస్తుత వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ జీవన్ పాటిల్ బతుకమ్మ కుంటను సందర్శించారు. బతుకమ్మ కుంటను అభివృద్ధి పేరుతో హద్దులు చేరిపేయడం, కుంట ప్రాంతాన్ని మట్టితో పూడ్చి వేయడం సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పారు. రెండు సార్లు ప్రతిపాదనలను పంపినప్పటికీ అప్పటి జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ తిరస్కరించారు. దీంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నేరుగా హన్మకొండకు వెళ్లి జేసీతో వాగ్వివాదానికి దిగారు. అప్పట్లో జేసీ పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు వివాదమైంది. అంతలోనే జేసీ బదిలీ కావడంతో ఇష్టారాజ్యంగా బతుకమ్మ కుంట పనులను చేపట్టారు. నిబంధనలు పాటించకుండా ఐదు ఎకరాల స్థలంలో దేవాదుల కాల్వల నుంచి మట్టిని తీసుకువచ్చి పూడ్చి వేశారు. ఇప్పుడు బతుకమ్మ కుంట పనులపై కలెక్టర్ దేవసేన అభ్యం తరం వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ కుంట స్థలాన్ని ఆక్రమించినట్లు బహిరంగంగానే ఆరోపించారు. ట్రస్టీ పేరుతో దుర్గమ్మగుడిని ఎమ్మెల్యే పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, దానిని రద్దు చేయించానని చెప్పడం మరోమారు ముత్తిరెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. కలెక్టర్‌పై సీఎస్‌కు ఫిర్యాదు... బతుకమ్మ కుంట విషయంలో కలెక్టర్ దేవసేన చేసిన వ్యాఖ్యలపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బుధవారం సాయంత్రం సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ఛీప్ సెక్రటరీ వీకే సింగ్‌ను కలిసి పరిస్థితి వివరించినట్లు తెలిసింది. తాను భూకబ్జాకు పాల్పడలేదని వివరించారు. అదేవిధంగా అసెంబ్లీ కార్యదర్శిని కలెక్టర్ తన పట్ల వ్యవరించిన తీరును వివరించారు. సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ముదురుతున్న వివాదం... కలెక్టర్‌పై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫిర్యాదు చేయడం, కలెక్టర్‌కు రాజకీయ పార్టీల నాయకులు మద్దతుగా నిలవడం ఇద్దరి మధ్య వివాదం ముదురుతోంది. కలెక్టర్, ఎమ్మెల్యే మధ్య అంతర్గతంగా ఉన్న బేదాభిప్రాయాలు బతుకమ్మ కుంట సాక్షి బయట పడ్డాయి. విభేదాలు తారస్థాయికి చేరడంతో ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారి తీస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
బాహుబలి చీరలు.. బంపర్ హిట్టు!!
బాహుబలి-2 సినిమా వచ్చినప్పటి నుంచి ప్రతి విషయంలో ఆ సినిమా మానియా స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఈ మానియా చీరలకు కూడా పాకింది. బాహుబలి సినిమా పోస్టర్లనే చీరల మీద ప్రింట్ చేసి, వాటిని అమ్ముతుంటే.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం అయిన ఏలూరులోని ఒక మిల్లులో ఈ చీరలను ప్రింటింగ్ చేయిస్తున్నారు. సినిమాలోని కొన్ని దృశ్యాలను ఎంపిక చేసుకుని, మంచి రంగులతో చీరల మీద వాటిని ప్రింట్ చేయిస్తున్నారు. తొలి బ్యాచ్‌లో కేవలం 50 చీరలు మాత్రమే ప్రింట్ చేయించి కొంతమంది స్నేహితులు వాటిని పంచుకున్నారు. సినిమా విడుదల రోజున వాళ్లంతా కలిసి ఆ చీరలు కట్టుకుని సినిమా చూశారు. దేవసేన, అమరేంద్ర బాహుబలి ఇద్దరూ విల్లు పట్టుకుని, ఒక్కొక్కరు మూడేసి బాణాలు పట్టుకుని ఉన్న ఫొటోను చీర పల్లు మీద ప్రింట్ చేయించారు. దాంతోపాటు మాహిష్మతి సామ్రాజ్యాన్ని కూడా మొత్తం చీరమీద వచ్చేలా ప్రింట్ చేశారు. ఆ చీరలు కట్టుకుని తన స్నేహితురాళ్లతో ఉన్న ఫొటోను ఫేస్బుక్లోను, వాట్సప్లోను ఒక మహిళ పోస్ట్ చేయగా, అది విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ చీరలు తమకు కావాలంటే తమకు కావాలంటూ ఆమెకు విపరీతంగా ఫోన్లు వచ్చాయి. దాంతో ఇప్పుడు దాదాపు మరో 500 వరకు చీరలకు ఆర్డర్ ఇచ్చారు. ఈసారి రమ్యకృష్ణ, రాణా దగ్గుబాటిల ఫొటోలు కూడా వేయిస్తున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా ఈ చీరల ఫొటోను గతంలో తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఇంతకుముందు రజనీకాంత్ నటించిన కబాలి సినిమా సన్నివేశాలను కూడా ఇలా చీరల మీద ప్రింట్లు వేయించారు. #Baahubali2mania -
దేవసేన.. రేపే విడుదల!
బాహుబలి చిత్రంలోని ప్రధాన పాత్రల పోస్టర్లు ఒక్కోటిగా విడుదల చేస్తున్న ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. అందులోని హీరోయిన్ అనుష్క పోషిస్తున్న 'దేవసేన' పోస్టర్‌ను బుధవారం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా రాజమౌళి వెల్లడించారు. సోమవారం ఆయన విడుదల చేసిన హీరో ప్రభాస్ 'శివుడు' పోస్టర్ అటు సోషల్ మీడియాలోను, ఇటు మీడియాలో కూడా బాగా హిట్టయింది. దానికి కృతజ్ఞతలు చెబుతూనే 'దేవసేన' అనుష్క పోస్టర్‌ను బుధవారం విడుదల చేస్తున్న విషయాన్ని తెలిపారు. వాస్తవానికి దేవసేన పాత్ర ప్రధానంగా బాహుబలి రెండో భాగంలో ఉంటుంది. అయితే మొదటి భాగంలో కూడా వేరే అవతారంలో కొద్దిసేపు అనుష్క కనిపిస్తుందని జక్కన్న చెప్పారు. Thanks again for the awesome response.😊 Most of you might already have known that Anushka is the heroine of Baahubali Part 2..But in this — rajamouli ss (@ssrajamouli) May 4, 2015 First part of #Baahubali, The Beginning, she appears briefly in a completely different avatar… NextUp.. #Devasena on 6th May #LiveTheEpic — rajamouli ss (@ssrajamouli) May 4, 2015