కలెక్టర్‌ శ్రీదేవసేనకు గవర్నర్‌ లేఖ | Governor Tamilisai Letter To Congratulating Collector Devasena | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ శ్రీదేవసేనకు గవర్నర్‌ లేఖ

Published Sat, Dec 14 2019 8:07 AM | Last Updated on Sat, Dec 14 2019 8:07 AM

Governor Tamilisai Letter To Congratulating Collector Devasena - Sakshi

సాక్షి,పెద్దపల్లి: ‘జిల్లాలో నా పర్యటన సందర్భంగా మీరు, మీ జిల్లా అధికారులు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మీ ఆతిథ్యం ఆకట్టుకుంది’ అని రాష్ట్ర గవర్నర్‌ తమిళసై జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేనను అభినందిస్తూ శుక్రవారం లేఖ రాశారు. విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం, స్వీయరక్షణను పెంపొందించడానికి నేర్పిస్తున్న మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ, బట్టబ్యాగుల తయారీ, సబల నాప్‌కిన్స్‌ తయారీ గురించి ప్రముఖంగా లేఖలో ప్రస్తావించారు. నందిమేడారం వద్ద నిర్మించిన కాళేశ్వరం ప్యాకేజ్‌–6 సందర్శించడంపై ఆనందం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement