నెరవేరిన టీచర్ల కల | Teachers promotions and transfers simultaneous | Sakshi
Sakshi News home page

నెరవేరిన టీచర్ల కల

Published Fri, Jun 28 2024 5:19 AM | Last Updated on Fri, Jun 28 2024 5:19 AM

Teachers promotions and transfers simultaneous

18,942 మందికి ఒకేసారి ప్రమోషన్లు, బదిలీలు

దశాబ్దం తర్వాత పదోన్నతులు 

న్యాయ వివాదాలన్నీ క్లియర్‌.. ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన ప్రభుత్వం 

టీచర్లలో వ్యక్తమవుతున్న ఆనందం

సాక్షి, హైదరాబాద్‌: పదోన్నతుల కోసం దాదాపు దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల కల ఎట్టకేలకు నెరవేరింది. రంగారెడ్డి జిల్లా మినహా రెండు జోన్లలోనూ పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. చివరిసారిగా 2015లో పదోన్నతులు కల్పించారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ప్రమోషన్ల ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. టీచర్ల హేతుబదీ్ధకరణ చేపట్టాలని కొన్నాళ్లు భావించారు. కోర్టు కేసుల కారణంగా మరికొంత జాప్యం జరిగింది. 2023లో బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ కూడా ఇచ్చారు. 

మల్టీజోన్‌–1లో కొంత వరకూ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ ముందుకెళ్లింది. అంతలోనే స్పౌజ్‌ కేసుల కారణంగా ఇది ఆగిపోయింది. పండిట్లు తమ పోస్టులు తమకే ఇవ్వాలన్న డిమాండ్‌తో కోర్టును ఆశ్రయించారు. వీటిని పక్కనబెట్టి ప్రమోషన్లు ఇవ్వాలని భావించారు. ఈ సమయంలో ప్రమోషన్లకు టెట్‌ ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనను కొంతమంది టీచర్లు ముందుకు తెచ్చారు. న్యాయస్థానం స్టే కారణంగా 2023లో ఇది ఆగిపోయింది. 

ఈలోగా ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమోషన్లు, బదిలీలు చేయాలని అధికారులు కంకణం కట్టుకున్నారు. ఈ వ్యవహారంలో పాఠశాల విద్య కమిషనర్‌ దేవసేన ప్రత్యేక దృష్టి పెట్టారు. వ్యూహాత్మకంగా న్యాయ పరమైన చిక్కులు తొలగించారు. దీంతో 18,942 మందికి ఒకేసారి పదోన్నతులు దక్కాయి. ఎస్‌జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా, కొంతమంది, స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి హెచ్‌ఎంలుగా మరికొంతమంది ప్రమోషన్లు పొందారు. వీళ్లందరినీ బదిలీ చేశారు. దీంతో ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 

ఖాళీలు 22 వేల పైనే... 
బదిలీలు, పదోన్నతుల తర్వాత వాస్తవ ఖాళీలు అధికారులు లెక్కగట్టాల్సి ఉంది. ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో 22 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉండే వీలుంది. 18,942 మందికి ప్రమోషన్లు ఇచ్చినా... వీరిలో 3 వేల మంది ఒకటికి మించి పదోన్నతులకు అర్హత ఉన్నవారున్నారు. ఉదాహరణకు సైన్స్, మేథ్స్‌ సబ్జెక్టులు రెండింటికీ అర్హత ఉంటుంది. 

పదోన్నతి రెండింటికీ లభిస్తుంది. అయితే, టీచర్‌ ఒకే సబ్జెక్టులో పదోన్నతి తీసుకోవాలి. ఈ రకంగా 3 వేల ఖాళీలు ఏర్పడే వీలుంది. జిల్లాల వారీగా ఈ లెక్కలు తేలితే... ఈ స్థానంలో మరికొన్ని పదోన్నతులు లభించే అవకాశముంది. జూలైలో నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో ప్రస్తుతం 11 వేల పోస్టులను చేర్చారు. పదోన్నతుల ద్వారా మరో 11 వేల వరకూ ఖాళీ అయ్యే వీలుంది. వీటిని కూడా చేర్చి, పూర్తిస్థాయిలో టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.  

ఇదో చరిత్ర : ముఖ్యమంత్రి కార్యాలయం 
ఇంత పెద్ద మొత్తంలో టీచర్లకు పదోన్నతులు కల్పించడం రాష్ట్ర చరిత్రలోనే గొప్ప విషయమని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఓ ప్రకటనలో పేర్కొంది. ఎక్కడా ఎలాంటి వివాదానికి తావివ్వకుండా, చట్టపరమైన చిక్కులను అధిగమించడంలో ప్రభుత్వం చూపిన చొరవను ఉపాధ్యాయ సంఘాలు ప్రశంసిస్తున్నాయని తెలిపింది. టీచర్ల కష్టాన్ని, శ్రమను ప్రభుత్వం గుర్తించిందని, సముచిత రీతిలో గౌరవించిందని, ఈ కారణంగా టీచర్లు మరింత కంకణబద్దులై పనిచేస్తారన్న ఆశాభావాన్ని సీఎంవో వ్యక్తం చేసింది.  

ఖాళీలు 22 వేల పైనే...
బదిలీలు, పదోన్నతుల తర్వాత వాస్తవ ఖాళీలను అధికారులు లెక్కగట్టాల్సి ఉంది. ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో 22 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉండే వీలుంది. 18,942 మందికి ప్రమోషన్లు ఇచ్చినా.. వీరిలో 3 వేల మంది ఒకటికి మించి పదోన్నతులకు అర్హత ఉన్నవారున్నారు. ఉదాహరణకు సైన్స్, మేథ్స్‌ సబ్జెక్టులు రెండింటికీ అర్హత ఉంటుంది. పదోన్నతి రెండింటికీ లభిస్తుంది. 

అయితే, టీచర్‌ ఒకే సబ్జెక్టులో పదోన్నతి తీసుకోవాలి. ఈ రకంగా 3 వేల ఖాళీలు ఏర్పడే వీలుంది. జిల్లాల వారీగా ఈ లెక్కలు తేలితే... ఈ స్థానంలో మరికొన్ని పదోన్నతులు లభించే అవకాశముంది. జూలైలో నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో ప్రస్తుతం 11 వేల పోస్టులను చేర్చారు. పదోన్నతుల ద్వారా మరో 11 వేల వరకూ ఖాళీ అయ్యే వీలుంది. వీటిని కూడా చేర్చి, పూర్తిస్థాయిలో టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement