
Manchu Manoj Emotional Note On Completing Of 18 Years In Tollywood: 'దొంగ దొంగది' చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు మంచు మనోజ్. డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు కుమారుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజు భాయ్, నేను మీకు తెలుసా?, బిందాస్, వేదం, ఊ కొడతారా ఉలిక్కి పడతారా?, మిస్టర్. నూకయ్య, పోటుగాడు వంటి తదితర విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్నాడు మంచు మనోజ్. సుమారు ఐదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్ 'చివరిగా ఒక్కడు మిగిలాడు'తో అలరించాడు. అయితే మంచు మనోజ్ హీరోగా మొదలు పెట్టిన సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు మంచు మనోజ్. ''మీ అందరి ప్రేమాభిమానాలకు నేను ఎప్పడూ కృతజ్ఞుడిని. తెలుగు సినీ ఇండస్ట్రీలో నా ప్రయాణానికి నేటితో 18 ఏళ్లు. ఈ ప్రయాణాన్ని నటుడిగానే కాకుండా ఒక వ్యక్తిగా నాకు చాలా స్పెషల్. ప్రేక్షకులు, నా నిర్మాతలు, దర్శకులు, టెక్నిషియన్స్, సహ నటులు, మీడియాకు కృతజ్ఞతలు చెప్పి సరిపెట్టలేను. మీరు నాపై చూపించిన ప్రేమ, అభిమానంతోనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. నా తొలి చిత్రం నిర్మాతలు ఎన్వీ ప్రసాద్ గారు, అశోక్ గారు నాపై ఉంచిన నమ్మకం నా ఎదుగుదలకు తోడ్పడింది. దొంగ దొంగది చిత్రం నాకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నానని తెలుసు. కానీ ఇది చాలా అవసరమైన విరామం. నేను సినిమాలతో మీ ముందుకు రాకున్న, నన్ను మీ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. చాలా సపోర్ట్‌గా నిలిచారు. చెప్పేందుకు మాటలు రావడం లేదు. మీ అందరి ఆశీర్వాదంతో నేను మరిత స్ట్రాంగ్‌గా వస్తానని ప్రమాణం చేస్తున్నా'' అంటూ ఇంకా రాసుకొచ్చాడు.
Thank you and love you all 🙏🏼 #18YearsOfManojManchuInTFI 🙏🏼🙏🏼 pic.twitter.com/QNRB2MGapi
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 6, 2022
ప్రస్తుతం ఈ ఎమోషనల్ నోట్ అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. శుభాకాంక్షలు చెబుతూ, ఒక మంచి హిట్ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. 'బిగ్ స్క్రీన్‌పై మిస్ అవుతున్నాం. నీ సినిమాల కోసం ఎదురుచూస్తున్నాం అన్న..' అని కామెంట్స్ కూడా పెడుతున్నారు. కాగా మంచు మనోజ్ చేతిలో 'అహం బ్రహ్మాస్మీ' సినిమా ఉంది. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించి చాలా రోజులు అవుతున్నా, ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ లేదు.
Comments
Please login to add a commentAdd a comment