
మంచు ఫ్యామిలీలో విభేదాలంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్, విష్ణుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందంటూ గుసగుసలు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్‌ని నిజం చేస్తూ ఓ సంచలన వీడియో బయటకు వచ్చింది. తన అన్నతో విభేదాలు ఉన్నాయంటూ స్వయంగా మంచు మనోజ్ బయటపెట్టాడు. విష్ణు ఇంట్లోకి చొరబడి తన అనుచరులపై దాడి చేశాడంటూ తాజాగా మనోజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు.
దీంతో ఈ వీడియో నెట్టంట సంచలనం రేపుతోంది. విష్ణు ఇంట్లోకి చోరబడి మనోజ్ సన్నిహితుడు అయిన సారథితో వివాదానికి దిగడమే కాదు అతడిపై దాడి చేశాడంటూ మనోజ్ వీడియో విడుదల చేశాడు. ‘ఇదీ పరిస్థితి.. కొంతకాలంగా మా అన్న విష్ణు వ్యవహరం ఇలా ఉంది’ అంటూ మనోజ్ అసలు విషయం బయటపెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment