మంచు ఫ్యామిలీలో ఆగని గొడవలు? | Manchu Vishnu Missing In Manoj Daughter Naming Ceremony, Creates Buzz In Social Media | Sakshi
Sakshi News home page

బారసాల వేడుకలో కనిపించని విష్ణు.. మంచు ఫ్యామిలీలో ఆగని గొడవలు?

Published Tue, Jul 9 2024 10:47 AM | Last Updated on Tue, Jul 9 2024 12:07 PM

Manchu Vishnu Missing in Manoj Daughter Naming Ceremony

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌- మౌనిక దంపతులు గారాలపట్టి బారసాల ఎంతో ఘనంగా జరిగింది. తమ పాపాయికి దేవసేన శోభా ఎమ్‌ఎమ్‌ అని నామకరణం చేశారు. శివభక్తుడైన మనోజ్‌.. ముక్కంటి కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి భార్య దేవసేన పేరును కూతురి కోసం ఎంచుకున్నాడు. అలాగే మౌనిక తల్లి శోభ పేరును కూడా సెలక్ట్‌ చేశారు. MM పులి ఆమె ముద్దు పేరన్న విషయం తెలిసిందే! 

మూడూ కలిసొచ్చేలా..
ఈ మూడూ కలిసి తన చిన్నారికి దేవసేన శోభా MM అని నామకరణం చేశారు. ఈ బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోను సోషల్‌ మీడియాలో వదిలారు. అయితే అందులో మనోజ్‌ సోదరుడు, హీరో మంచు విష్ణు కనిపించనేలేదు. అలాగే చిన్నారి పేరును ప్రకటిస్తూ విడుదల చేసిన నోట్‌లోనూ విష్ణు పేరు ఎక్కడా లేదు. పేరెంట్స్‌ మోహన్‌బాబు- నిర్మలాదేవి, సోదరి మంచు లక్ష్మి పేర్లతో పాటు మౌనిక సోదరులు అఖిల, విక్యంత్‌ పేర్లను సైతం ప్రస్తావిస్తూ కృతజ్ఞత చెప్పిన మనోజ్‌.. తన అన్న పేరును మాత్రం వదిలేశాడు.

ఆగని గొడవలు?
దీంతో మంచు ఫ్యామిలీ ఇంట గొడవలు ఆగిపోలేదని, విష్ణు - మనోజ్‌ మధ్య మనస్పర్థలు అలాగే కొనసాగుతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే మనోజ్‌ పెళ్లికి సైతం విష్ణు అతిథిలాగే వచ్చి వెళ్లాడు. మనోజ్‌తో సన్నిహితంగా ఉండే సారథి ఇంటికి వెళ్లి విష్ణు గొడవపడటం, అందుకు సంబంధించిన వీడియో వైరలవడంతో ఈ అన్నదమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని అందరికీ తెలిసిపోయింది. తర్వాత మోహన్‌బాబు ఈ విషయంలో జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశాడు.

 

 చదవండి: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు.. సిద్దార్థ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement