‘ది డీల్’ హిట్‌ కావాలి: మంచు విష్ణు | Manchu Vishnu Talks About The Deal Movie | Sakshi
Sakshi News home page

‘ది డీల్’ హిట్‌ కావాలి: మంచు విష్ణు

Published Thu, Sep 26 2024 11:15 AM | Last Updated on Thu, Sep 26 2024 1:45 PM

Manchu Vishnu Talks About The Deal Movie

‘ఈశ్వర్’ఫేం హనుకోట్ల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది డీల్’. సిటడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ నిర్వహణలో  పద్మా రమకాంత రావు, రామకృష్ణ కొళివి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 18న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా  ఈ సినిమాలోని ఏమయ్యిందో ఏమయ్యిందో" పాటని ప్రముఖ హీరో మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మంచు విష్ణు విడుదల చేశారు. 

ఈ సందర్భంగామంచు విష్ణు మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీలో యాక్టింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తూ ఎంతో మందికి శిక్షణనిస్తున్న డా. హను కోట్ల గారికి అల్ ది బెస్ట్ చెబుతూ ఈ చిత్రం ఘన విజయం సాధించాలని  మనస్ఫూర్తిగా అభినందించారు.ఈ కార్యక్రమంలో డిజిక్వెస్ట్ అధినేత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పూర్వ అధ్యక్షులు శ్రీ K. బసిరెడ్డి, ప్రముఖ నిర్మాత శ్రీ PLK రెడ్డి, "ది డీల్ " చిత్ర నిర్మాత రామకృష్ణ కొళివి, చిత్ర సమర్పకులు డా. అనితారావు, దర్శకులు డా. హను కోట్లతో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement