The Deal Movie
-
'ది డీల్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. 18న మూవీ రిలీజ్
'ఈశ్వర్' సినిమాతో నటుడిగా పరిచయమైన హను కోట్ల.. ఇప్పుడు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'ది డీల్'. పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు. చందన, ధరణి ప్రియ హీరోయిన్లు. అక్టోబర్ 18న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.(ఇదీ చదవండి: బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక.. ప్రభుత్వంతో కలిసి)'ది డీల్' సినిమాతో దర్శకుడిగా, హీరోగా మీ ముందుకు వస్తున్నాను. మంచి థ్రిల్లర్ మూవీ ఇది. పార్ట్ 2 కూడా ఉంటుంది. ఈ మూవీని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నానని హను కోట్ల చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 'సిటాడెల్' ట్రైలర్.. ఫైట్స్ అదరగొట్టేసిన సమంత) -
దర్శకుడిగా ది డీల్.. నటనే తన జీల్..
నాంపల్లి: సినిమాలకు మూలం నాటకం.. తొలితరం నటులందరూ నాటకరంగం నుంచి వచ్చిన వారే.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, ఎన్వి రంగారావు, సావిత్రి వంటివారెందరో ఈ రంగంలోకి వచ్చినవారే. ఇతర భాషల్లోనూ అనేక మంది నటులు నాటక రంగం నుంచి వెండితెరకు పరిచయమైనవారే. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి బిఏ.యాక్టింగ్, ఎంఏ దర్శకత్వం పూర్తి చేసి ఆధునిక తెలుగు నాటక రంగంలో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న డాక్టర్ హనుకోట్ల మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎంఏ పూర్తి చేసిన వెంటనే ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్‌గా మూగ పాత్రలో అందరినీ మెప్పించాడు. ఆ తర్వాత అదే వర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి ప్రొఫెసర్‌గా, రంగస్థల కళల శాఖాధిపతిగా, లలిత కళాపీఠం పీఠాధిపతిగా(డీన్) ఎందరో నటులను తీర్చిదిద్దుతున్నారు. దర్శకుడిగా, రచయితగా... తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులతో కలిసి స్వీయ రచన, దర్శకత్వంలో కె2 నాటకాన్ని ప్రదర్శించి ఉత్తమ దర్శకుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత కళ్యాణి నాటకానికి తన బృందంతో ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు వెండి నందిని అందుకున్నారు. నాటక రంగ ఆచార్యుడిగా తెలుగులో నాయకురాలు, గంగిరెద్దు, జయ జయహే తెలంగాణ, రామప్ప వంటి అత్యున్నత ప్రమాణాలు కలిగిన నాటకాలను నిర్మించారు. తెలుగులో మొట్టమొదటి నాటకత్రయం ‘ప్రతాపరుద్రమ’ దర్శకత్వం వహించి మెప్పించారు. రచయితగా గంగిరెద్దు, కాశీ్మర్ టు కన్యాకుమారి, గబ్బర్‌సింగ్, ధనత్రయోదశి, నాటకాలలో నూతన థోరణులను ప్రవేశపెట్టాడు. మరోసారి వెండితెరకు.. కేవలం రంగస్థలానికే పరిమితం కాకుండా రేడియో జాకీగా, టెలివిజన్ నటుడిగా, దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించి ఈటీవీ– 2లో ప్రసారమైన ‘మాయాబజార్’ రాజకీయ వ్యంగ్య రూపకంతో పాటు దూరదర్శన్‌లో అనేక ఎపిసోడ్లకు దర్శకత్వం వహించారు. ఈశ్వర్ సినిమా తర్వాత ఆగిపోయిన తన సినీ ప్రస్థానాన్ని తిరిగి కొనసాగిస్తూ తన స్వీయ దర్శకత్వంలో హెచ్.పద్మారమాకాంతరావు, రామకృష్ణ నిర్మాతలుగా ‘ద డీల్’ అనే సినిమాతో అక్టోబరు 18న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు పోస్టర్ లాంచ్ చేయగా, ప్రముఖ హీరో మంచు విష్ణు ఈ సినిమా పాటను విడుదల చేశారు. దసరా సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ద డీల్ టైటిల్ సాంగ్‌ని విడుదల చేశారు. -
‘ది డీల్’ హిట్ కావాలి: మంచు విష్ణు
‘ఈశ్వర్’ఫేం హనుకోట్ల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది డీల్’. సిటడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ నిర్వహణలో పద్మా రమకాంత రావు, రామకృష్ణ కొళివి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 18న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలోని ఏమయ్యిందో ఏమయ్యిందో" పాటని ప్రముఖ హీరో మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మంచు విష్ణు విడుదల చేశారు. ఈ సందర్భంగామంచు విష్ణు మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీలో యాక్టింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తూ ఎంతో మందికి శిక్షణనిస్తున్న డా. హను కోట్ల గారికి అల్ ది బెస్ట్ చెబుతూ ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా అభినందించారు.ఈ కార్యక్రమంలో డిజిక్వెస్ట్ అధినేత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పూర్వ అధ్యక్షులు శ్రీ K. బసిరెడ్డి, ప్రముఖ నిర్మాత శ్రీ PLK రెడ్డి, "ది డీల్ " చిత్ర నిర్మాత రామకృష్ణ కొళివి, చిత్ర సమర్పకులు డా. అనితారావు, దర్శకులు డా. హను కోట్లతో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు. -
దిల్ రాజు చేతుల మీదుగా ‘ది డీల్’ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
ఈశ్వర్ సినిమాలొ ప్రభాస్ ఫ్రెండ్, మూగవాడిగా నటించి తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు హను కోట్ల. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ తగిన పాత్ర కోసం ఎదురుచూశారు.. ఇప్పుడు ‘ది డీల్’ అనే సినిమా ద్వారా హీరో గా పరిచయం కాబోతున్నాడు. సిటడెల్ క్రెయేషన్, డిజిక్విస్ట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా హీరో, దర్శకుడు డాక్టర్ హను కోట్ల పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ‘ది డీల్’ మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రెండు బాగాలు గా రాబోతున్న ఈ మూవీ మొదటి భాగం మొత్తం హైదరాబాద్ లో.. కొంత మలేషియాలో చిత్రికరించామని, మలి భాగాన్ని మొత్తం మలేషియలో షూటింగ్ చేసి చిత్రాన్ని కంప్లీట్ చేయనున్నట్లు యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఈ చిత్రం మొదటి భాగం దసరాకి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ లుగా చందన, ధరణి ప్రియా నటించగా రఘు కుంచె, రవి ప్రకాష్, మహేష్ పవన్, గిరి, వెంకట్ గోవాడ, శ్రీవాణి, సుజాత దిక్షిత్, సురభి లలిత ముఖ్య పాత్రలు పోషించారు.