ప్రభాస్‌పై చిన్నచూపు.. మనోభావాలు దెబ్బతిన్నాయన్న మంచు విష్ణు | Manchu Vishnu Write Letter to CINETAA over Arshad Warsi Derogatory Comments | Sakshi
Sakshi News home page

Manchu Vishnu: అర్షద్‌ మాటలు బాధేశాయి.. ఇంకోసారి ఇలా..

Published Fri, Aug 23 2024 12:52 PM | Last Updated on Fri, Aug 23 2024 6:35 PM

Manchu Vishnu Write Letter to CINETAA over Arshad Warsi Derogatory Comments

ఒక్కసారి మాట అనేస్తే వెనక్కు తిరిగి తీసుకోలేం. అందుకే సెలబ్రిటీలు ఆచితూచి మాట్లాడాలి. ఏమాత్రం నోరుజారినా విమర్శలపాలవడం ఖాయం. బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కల్కి సినిమా తనకు నచ్చలేదన్నాడు. అక్కడితో ఆగకుండా అందులో ప్రభాస్‌ లుక్‌ జోకర్‌లా ఉందని కామెంట్‌ చేయడంతో విమర్శలపాలయ్యాడు. తాజాగా ఈ వివాదంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించాడు.

మంచు విష్ణు లేఖ
ప్రభాస్‌పై అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేసిన విష్ణు.. సినీ టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ కు లేఖ రాశాడు. ప్రతి వ్యక్తికి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుంది. దాన్ని మేము గౌరవిస్తాము. కానీ, అర్షద్‌.. ప్రభాస్ గురించి చులకనగా మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ వర్గాల్లో, అభిమానులలో చాలా మంది మనోభావాలను దెబ్బతీసింది.

బాధేసింది
నేటి సోషల్ మీడియా యుగంలో, చిన్న పదం కూడా పెద్ద చర్చకు దారి తీస్తోంది. కాబట్టి.. పబ్లిక్‌ ఫిగర్స్‌గా మన భావాలను వ్యక్తీకరించడంలో జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. వార్సి వ్యాఖ్యలు సినీ ప్రేమికులలో, సినీ సోదరులలో అనవసరమైన ఆందోళనను సృష్టించింది. తన మాటలు మాకెంతో బాధ కలిగించాయి. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడని అర్షద్ వార్సీని కోరుతున్నాము.

అందరిదీ ఒకే కుటుంబం
గౌరవాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. సినీ ఇండస్ట్రీ అనే ఒక కుటుంబం కింద అందరం ఉన్నాం.. సినిమా పట్ల మనకున్న అభిరుచికి కట్టుబడి ఉన్నామని గుర్తుంచుకోండి. మన బలం మన ఐక్యతలో ఉంది. ఈ ఐక్యతను కాపాడుకోవడం మన సమిష్టి బాధ్యత. ఇండస్ట్రీలో ప్రశాంత వాతావరణం ఉండేట్లు చూస్తారని ఆశిస్తున్నాను అని ఆ లేఖలో పేర్కొన్నాడు.

MAA అసోసియేషన్ సీరియస్... మరి ప్రభాస్ ని అంటే కన్నప్ప ఊరుకుంటాడా...

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement