
ఆర్‌ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి యూత్‌లో క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. గతేడాది మంగళవారం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అజయ్ భూపతి డైరెక్షన్‌లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే పాయల్ టాలీవుడ్‌లో అంతకుముందు ఆర్డీఎక్స్ లవ్’, వెంకీమామ, డిస్కోరాజా, తీస్ మార్‌ఖాన్, జిన్నా చిత్రాల్లో కనిపించింది. మంగళవారం మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న పాయల్ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటో మీరు చూసేయండి.
పాయల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఎవరైతే మిమ్మల్ని కిందకు లాగేందుకు యత్నిస్తారో అలాంటివారికి దూరంగా ఉండండి. అలాగే పరిష్కారం సాధ్యం కానీ సమస్యలకు దూరంగా వెళ్లండి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారిని దూరం పెట్టండి. మీకు ఏదైతే హానికరంగా భావిస్తారో వాటన్నింటికీ దూరంగా ఉండటమే మంచిది. అంతే కాదు ఆరోగ్యానికి మంచిది కూడా' అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment