ఈమెని గుర్తుపట్టారా? తెలుగు నటి, నేషనల్ అవార్డ్ విన్నర్ | Mansion 24 Web Series Actress Shraddha Dangar Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: ఆ హారర్ సిరీస్‌తో భయపెట్టిందీ బ్యూటీ.. ఎవరో కనిపెట్టారా?

Published Mon, Oct 30 2023 9:08 PM | Last Updated on Mon, Oct 30 2023 10:27 PM

Mansion 24 Web Series Actress Shraddha Dangar Details - Sakshi

సినిమాలు హిట్ అవుతున్నాయి, అవార్డులు అందుకుంటున్నాయంటే.. అందులో డైరెక్టర్ల కృషి ఎంత ఉంటుందో.. యాక్టర్స్ కష్టం అంతకంటే ఎక్కువ ఉంటుంది. అలా ఈ బ్యూటీ కూడా ఓ సినిమా చేసింది. ఆ చిత్రానికి, అందులో నటించిన ఈమెకు నేషనల్ అవార్డ్స్ వరించాయి. ఈ మధ్యనే తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. మరి ఇన్ని చెప్పాం కదా. ఎవరో కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్రద్ధా దంగర్. ఎవరబ్బా అనుకుంటున్నారేమో, కంగారు పడకండి. రీసెంట్‌గా ఓటీటీలో 'మ్యాన్షన్ 24' అని ఓ తెలుగు హారర్ వెబ్ సిరీస్ రిలీజైంది కదా. అందులో రజియా అనే పాత్రలో నటించింది పైన కనిపిస్తున్న బ్యూటీనే. స్వతహాగా గుజరాతీ అయిన ఈమె.. అక్కడే అరడజనుకి పైగా సినిమాలు చేసింది.

ఇంకా 30 ఏళ్ల కూడా నిండని ఈ చిన్నది.. 2019లో 'హెల్లరో' అనే సినిమాలో నటించింది. ఆ ఏడాదికి గానూ ఈ మూవీకి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. ఇందులో నటనకిగానూ శ్రద్ధా దంగర్‌కి స్పెషల్ జ్యూరీ కేటగిరీలో అవార్డు వచ్చింది. గుజరాతీలో 10 సినిమాలు, 3 వెబ్ సిరీసులు చేసిన ఈమె.. ఓంకార్ తీసిన 'మ్యాన్షన్ 24' సిరీస్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సో అదన్నమాట విషయం. నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. తెలుగులో మరిన్ని ఛాన్సులు దక్కించుకునే పనిలో బిజీగా ఉంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement