విషాద పాత్రలు పోషించడం, విషాదభరితమైన సీన్లు రక్తికట్టించడం అంత ఈజీ కాదు. కానీ అటువంటి పాత్రలను అలవోకగా చేసి ట్రాజెడీ క్వీన్ ఆఫ్ బాలీవుడ్‌గా కీర్తి గడించింది మీనా కుమారి. కానీ తన జీవితంలో కూడా అంతే ట్రాజెడీ ఉంటుందని బహుశా ఆమె కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. సినిమాల ద్వారా పేరు, డబ్బు సంపాదించింది కానీ ప్రేమ, పెళ్లి వల్ల తన జీవితాన్నే నాశనం చేసుకుంది.
ఫస్ట్ లవ్..
మీనా కుమారి.. ధర్మేంద్రను తొలిచూపులోనే ప్రేమించింది. అటు ధర్మేంద్ర ఆమెను గురువుగా, గైడ్‌గా భావించేవాడు. చివరికి ఆమె ప్రేమను అర్థం చేసుకున్నాడు. కానీ ఆమెకు నచ్చినట్లుగా కాకుండా తనకు నచ్చినట్లుగానే ఉండేవాడు. అలా మూడేళ్లకే బంధం ముగిసిపోవడంతో మీనా కుమారి మందుకు బానిసైంది. ఆ సమయంలో దర్శకుడు కమల్ ఆమ్రోహి ఆమెకు దగ్గరయ్యాడు. అతడి సినిమా అనార్కలి కోసం మహాబలేశ్వర్ వెళ్తుంటే రోడ్డు ప్రమాదంలో గాయపడింది. మూడు నెలలు ఆస్పత్రిలో ఉంటే ఆమె బాగోగులు చూసుకున్నాడు కమల్. అటు అనార్కలి సినిమా అటకెక్కింది. ఇటు మీనా, కమల్‌ల స్నేహం, ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే కమల్‌కు పెళ్లయి పిల్లలున్నారు. పైగా ఆమె కంటే 16 ఏళ్లు పెద్దవాడు కూడా!
తాగుడుకు అలవాటై
పెళ్లి తర్వాత తనకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. సాయంత్రం ఆరున్నరకల్లా ఇంటికి చేరుకోవాలని ఆదేశాలు.. తను పంపిన కారులోనే షూటింగ్ వెళ్లిరావాలని ఆంక్షలు.. కోస్టార్స్‌తో చనువుగా కనిపించొద్దని నిబంధనలు.. ఆమెను గమనించేందుకు ఓ వ్యక్తినీ నియమించాడు. అతడి పొసెసివ్‌నెస్ భరించలేకపోయింది. ఎనిమిదేళ్లకే ఇద్దరూ విడిపోయారు. మళ్లీ మద్యానికి బానిసై లివర్ సిర్రోసిస్ వ్యాధి బారిన పడింది. 38 ఏళ్లకే మరణించింది. నేడు(మార్చి 31) ఆమె వర్ధంతి.
మీనా కుమారి, కమల్ ఆమ్రోహి
దుష్ప్రచారం
ఈ సందర్భంగా మీనా భర్త కమల్ అమ్రోహి మొదటి భార్య కుమారుడు తాజ్దార్ ఆమ్రోహి.. నటితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. మా నాన్న- పిన్ని(మీనా) విడాకులు తీసుకోలేదు. భేదాభిప్రాయాల వల్ల విడివిడిగా జీవించారంతే! నాన్న.. పిన్నిని కొట్టాడని దుష్ప్రచారం చేశారు. ఆయన ఏనాడూ తనపై చేయి చేసుకోలేదు. ఆరేళ్ల వయసులో సవతి తల్లిదగ్గరకు వెళ్లాను. ఆ తర్వాత ఎన్నడూ మళ్లీ ఇంటికి వెళ్లలేదు. కన్నతల్లి కూడా గుర్తురానంత ప్రేమను పంచింది.
ఉత్తరాలు, బహుమతులు
నేను లేకుండా నిద్రపోయేదే కాదు. తన కారు వచ్చిందనగానే పరుగెత్తుకుంటూ వెళ్లేవాడిని. విద్యాభ్యాసం కోసం డెహ్రాడూన్ వెళ్లినప్పుడు నాకోసం ఉత్తరాలు రాసేది, బహుమతులు పంపేది. నాకేదైనా కావాలంటే వెంటనే పంపించేది. నేను అక్కడ ఉన్నప్పుడే వాళ్లు విడిపోయారు. నాన్న గురించి పిన్నికి లేనిపోనివి చెప్పి విడగొట్టేలా చేసినవారెవరో కూడా నాకు తెలుసు. కానీ నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోయిందని కోపం ఉండేది.
తాజ్దార్ ఆమ్రోహి, మీనా కుమారి
తనమీద కోపం
తను అనారోగ్యంతో ఉన్నప్పుడు నన్ను చూడాలనుందంటే వెళ్లాను. అది 1967.. తను నన్ను చూసిన చూపు ఎప్పటికీ మర్చిపోలేను (ఏడుస్తూ..). అనారోగ్యం వల్ల జుట్టంతా ఊడిపోయింది. బెడ్‌పై నుంచి లేవడానికి ప్రయత్నిస్తోంది కానీ తన వల్ల కావడం లేదు. నేను వెళ్లి తనను కూర్చోబెట్టాను. నా మీద కోపంగా ఉన్నావా? అంటూ నా తల నిమురుతూ ప్రేమ కురిపించింది. సవతి తల్లి అనే పదానికి ఉన్న అర్థాన్నే ఆవిడ మార్చేసింది. కాస్త కోలుకున్నాక.. నాకోసమే ఆగిపోయిన పాకీజా సినిమాను మా నాన్నతో కలిసి పూర్తి చేసింది' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌కు అమ్మ నగలు గిఫ్టిచ్చేవాడిని.. పెళ్లిలో..
Comments
Please login to add a commentAdd a comment