మహేశ్‌కు జోడీగా...? | Meenakshi Chaudhary In Mahesh Babu Guntur Karam | Sakshi
Sakshi News home page

మహేశ్‌కు జోడీగా...?

Published Sat, Jun 24 2023 12:36 AM | Last Updated on Sat, Jun 24 2023 10:14 AM

Meenakshi Chaudhary In Mahesh Babu Guntur Karam - Sakshi

‘గుంటూరు కారం’ సినిమాలో హీరోయిన్‌ మీనాక్షీ చౌదరి నటించనున్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. కథ రీత్యా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌కు చాన్స్‌ ఉంది. పూజా హెగ్డే, శ్రీలీలను ఎంపిక చేశారు. అయితే డేట్స్‌ సర్దుబాటు చేయలేక ఈ సినిమా నుంచి తప్పుకున్నారు పూజా హెగ్డే.

దీంతో పూజా ప్లేస్‌లోకి మరో హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో పడింది టీమ్‌. ఈ నేపథ్యంలో తాజాగా మీనాక్షీ చౌదరి పేరు వినిపిస్తోంది. రవితేజ ‘ఖిలాడి’, అడివి శేష్‌ ‘హిట్‌ 2’ వంటి సినిమాలతో మీనాక్షీ చౌదరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ప్రస్తుతం విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో ఈ బ్యూటీ నటిస్తున్నారు. మరి.. ‘గుంటూరు కారం’లో మహేశ్‌కు జోడీగా నటించే బంపర్‌ ఆఫర్‌ని మీనాక్షీ కొట్టేస్తారా? చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement