నేనేం క్రికెట్‌ కోసం పుట్టలేదు! | Mr And Mrs Mahi Movie Trailer Released, Check Trailer Highlights Inside | Sakshi
Sakshi News home page

నేనేం క్రికెట్‌ కోసం పుట్టలేదు!

Published Mon, May 13 2024 5:14 AM | Last Updated on Mon, May 13 2024 11:45 AM

Mr And Mrs Mahi Trailer Released

 రాజ్‌కుమార్‌ రావు, జాన్వీకపూర్‌ జంటగా నటించిన హిందీ చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’. క్రికెట్‌ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి శరణ్‌ శర్మ దర్శకుడు. ఈ సినిమాలో మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్‌ రావు, మహిమ పాత్రలో జాన్వీ కపూర్‌ నటించారని బాలీవుడ్‌ సమాచారం. జీ స్టూడియోస్, కరణ్‌ జోహార్, యశ్‌ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

 ‘నాకు ఇంకో ఏడాది అవకాశం కల్పించండి నాన్న.. నేను కచ్చితంగా సెలక్ట్‌ అవుతాను.. నా కలను బ్రేక్‌ చేయవద్దు నాన్న.. ప్లీజ్‌’, ‘మీ నాన్న కోసం నువ్వు (జాన్వీని ఉద్దేశిస్తూ..) డాక్టర్‌ అయ్యావు మహి.. కానీ నువ్వు ఏం కావాలనుకుంటున్నావు’ (రాజ్‌కుమార్‌ రావు), ‘నేనేం క్రికెట్‌ కోసం పుట్టలేదు’ (జాన్వీ కపూర్‌) వంటి డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి. క్రికెటర్‌ కావాలనుకున్న ఓ యువకుడు తన లక్ష్యాన్ని సాధించలేకపోతాడు. ఆ తర్వాత అతను పెళ్లి చేసుకుంటాడు.

వృత్తి రీత్యా డాక్టర్‌ అయిన తన భార్యలో క్రికెట్‌ ప్రతిభ ఉందని గ్రహించి, తన భార్యకు తానే క్రికెట్‌ కోచింగ్‌ ఇచ్చి, ఆమెను ్రపోత్సహించి క్రికెటర్‌ను చేయాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో ఆ భార్యాభర్తల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే నేపథ్యంలో  ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ సినిమా కథనం ఉంటుందని బాలీవుడ్‌ టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement