
కష్టపడితే ఫలితం దానంతటదే వస్తుందంటారు. అలా మృణాల్ ఠాకూర్ పుష్కరకాలంగా కష్టపడితే సీతారామం సినిమాతో రెండేళ్ల క్రితం బిగ్ బ్రేక్ అందుకుంది. ఈ మూవీ తర్వాతే తన ఫ్యాన్‌బేస్ పెరిగింది.. అవకాశాలూ పెరిగాయి. ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది మృణాల్.
రిలేషన్‌లో?
ఆమె మాట్లాడుతూ.. సినిమాలో నా పాత్రను ప్రేమిస్తూ, నా వర్క్‌ను గుర్తిస్తే నేను పడ్డ కష్టమంతా మర్చిపోతాను. నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తే నావైపు ఏదైనా తప్పుందేమో చెక్ చేసుకుని సరిచేసుకుంటాను. ప్రేమ విషయానికి వస్తే.. ఒకసారి ప్రేమలో పడ్డాక ఆ లవ్‌ను మరింత పెంచేందుకు ప్రయత్నించాలి. ఇంకా దేనిగురించీ ఆలోచించకూడదు. అనుబంధం, నమ్మకమనేది రెండువైపులా ఉండాలి. అయితే ఆ బంధం వర్కవుట్ కానప్పుడు వదిలేయడమే మంచిది. నా విషయానికి వస్తే నేను ఏ రిలేషన్‌షిప్‌లోనూ లేను. నాకు ప్రేమలో పడాలనుంది.
సెలబ్రిటీ అయితే అదే ప్రాబ్లమ్..
సెలబ్రిటీ అవడం వల్ల కొన్ని నెగెటివ్స్ కూడా ఉన్నాయి. కుటుంబానికి అవసరమైనప్పుడు మనం వారితో ఉండలేము. ఎక్కడో షూటింగ్ బిజీలో ఉంటూ ఫ్యామిలీని మిస్ అవుతాం. కొన్నిసార్లు నాక్కూడా సాధారణ జీవితాన్ని గడపాలని అనిపిస్తుంటుంది. ఇరవైలో పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లల్ని కని వారితో కలిసి డిన్నర్‌కు వెళ్తే బాగుండనిపిస్తుంది. సెలబ్రిటీగా ఓ గుడికి కూడా ఈజీగా వెళ్లలేము. నాకున్న పెద్ద భయం మరణం. దాని గురించి ఆలోచిస్తేనే భయమేస్తుంది. నేను చనిపోతే నా కుటుంబం ఏమైపోతుందో? అని ఆందోళనగా ఉంటుంది' అని చెప్పుకొచ్చింది.
చదవండి: పెళ్లైన ఏడాదికే విడాకులు.. ఒకప్పుడు స్టార్ హీరోలతో జోడీ.. ఇప్పుడేమో!
Comments
Please login to add a commentAdd a comment