ఇళయరాజా సోదరుడికి సతీవియోగం | Music Composer Gangai Amaran Wife Passes Away | Sakshi
Sakshi News home page

సంగీత దర్శకుడు గంగై అమరన్‌కు సతీ వియోగం

Published Tue, May 11 2021 11:06 AM | Last Updated on Tue, May 11 2021 11:27 AM

Music Composer Gangai Amaran Wife Passes Away - Sakshi

తమిళ సినిమా: సీనియర్‌ సంగీత దర్శకుడు గంగై అమరన్‌ భార్య మణిమేఖలై ఆదివారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఈమె వయసు 69 ఏళ్లు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడే గంగై అమరన్. సినీ దర్శకుడు, సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత అయిన గంగై అమరన్, మణిమేఖలై దంపతుల కొడుకులు దర్శకుడు వెంకట్‌ప్రభు, సంగీత దర్శకుడు, నటుడు ప్రేమ్‌జీ. కాగా వీరి తల్లి మణిమేఖలై ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు.

దీంతో ఆమెను చెన్నై లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. ఈమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా కోలీవుడ్‌లో కరోనా మరణాలు ఆగడం లేదు. తాజాగా ఈ మహమ్మారి నటుడు జోకర్‌ తులసి, దర్శకుడు దయాళన్‌ను బలితీసుకుంది.

చదవండి: కంటెస్టెంట్లకే షాక్‌: బిగ్‌బాస్‌ షో క్యాన్సిల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement