gangai amaran
-
8ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్
చెన్నై: సీనియర్ దర్శకుడు, పాటల రచయిత, సంగీత దర్శకుడు, నటుడు గంగై అమరన్ చాలా గ్యాప్ తరువాత మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నారు. 55 చిత్రాలకు పని చేసిన ఆయన, 19 చిత్రాలకు దర్శకత్వం వహించారు. గంగై అమరన్ కలం నుంచి జాలువారిన పలు పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో మారుమోగుతునే ఉన్నాయి. సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు, దర్శకుడు వెంకట్ ప్రభు తండ్రి అయిన ఈయన 2013 నుంచి నటనకు దూరంగా ఉన్నారు. కాగా తాజాగా అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రంలో గంగై అమరన్ అతిథి పాత్రలో నటించడం విశేషం. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ పతాకంపై వెడికరన్ పట్టి ఎస్.శక్తివేల్ నిర్మిస్తున్నారు. చదవండి : దాసరి అరుణ్‌పై అట్రాసిటీ కేసు ఆ ఫొటో వల్లే సినిమా ఛాన్స్ వచ్చింది : వైశాలీ రాజ్ -
ఇళయరాజా సోదరుడికి సతీవియోగం
తమిళ సినిమా: సీనియర్ సంగీత దర్శకుడు గంగై అమరన్ భార్య మణిమేఖలై ఆదివారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఈమె వయసు 69 ఏళ్లు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడే గంగై అమరన్. సినీ దర్శకుడు, సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత అయిన గంగై అమరన్, మణిమేఖలై దంపతుల కొడుకులు దర్శకుడు వెంకట్‌ప్రభు, సంగీత దర్శకుడు, నటుడు ప్రేమ్‌జీ. కాగా వీరి తల్లి మణిమేఖలై ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను చెన్నై లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. ఈమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా కోలీవుడ్‌లో కరోనా మరణాలు ఆగడం లేదు. తాజాగా ఈ మహమ్మారి నటుడు జోకర్ తులసి, దర్శకుడు దయాళన్‌ను బలితీసుకుంది. చదవండి: కంటెస్టెంట్లకే షాక్: బిగ్‌బాస్ షో క్యాన్సిల్ -
ఇళయరాజాపై సోదరుడి ఫైర్
ఇళయరాజాపై ఆయన సోదరుడు, సంగీత దర్శకుడు గంగైఅమరన్ ఫైర్ అయ్యారు. జాతీయ అవార్డును తిరస్కరించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇటీవల పలువురు విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన చర్యను చాలా మంది గర్హిస్తున్నారు. ఇళయరాజా 1000వ చిత్రం తారైతప్పటై చిత్ర నేపథ్య సంగీతానికిగాను ఆయనకు జాతీయ అవార్డు వరించింది. అయితే దాన్ని ఆయన తన సంగీతానికి సరైన గుర్తింపు లభించలేదంటూ తిరస్కరించారు. ఈ విషయంలో ఇళయరాజా నిర్ణయాన్ని ఆయన సోదరుడు, జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యుల్లో ఒకరైన గంగైఅమరన్ తీవ్రంగా ఖండించారు. ఇళయరాజా చర్యను తప్పు పట్టారు. ఈ విషయంపై గంగైఅమరన్ స్పందిస్తూ ఇళయరాజా గొప్ప సంగీత దర్శకుడే. అలాగని జాతీయ అవార్డును తిరస్కరంచడం సరైన చర్య కాదు.సంగీతంలో ఇద్దరికి అవార్డును అందించడంలో తప్పేమిటి? సంగీతానికి, పాటలకు ఒకరికే అవార్డు ప్రకటించాలనడంలో అర్థం లేదు. ఆస్కార్ అవార్డుల్లో ఇలాంటి విధానం లేదు. అయినా ఇప్పుడు ఒక్క ఇళయరాజా మినహా పాటలకు, నేపథ్యసంగీతానికి ఏ సంగీత దర్శకుడు అందిస్తున్నారు. ఒక్కో పాటకు ఒకరు సంగీతాన్ని అందిస్తున్న రోజులివి. అదే విధంగా పాత చింతకాయ పచ్చడిలా ఎప్పుడూ ఒకే తరహా సంగీతాన్ని అందిస్తే ఎలా? కొత్త కొత్త సంగీత దర్శకులు వస్తున్నారు. మన కాలం ముగిసిందన్న ఆలోచనకు రావాలి. ఇప్పుటికీ తాను యువకుడినే అనే ఆలోచనా ధోరణిని మార్చుకోవాలి. ఇళయరాజా గొప్ప సంగీత దర్శకుడే.అలాంటి వ్యక్తి భారతదేశంలో అత్యున్నతమైన జాతీయ అవార్డును తిరస్కరించడం ఆయన అభిమానులైన తనలాంటి వారికి అసంతృప్తిని కలిగించే విషయం. ఒక వేళ ఆయనకు అవార్డు అందుకోవడం ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని ముందే తెలిపితే ఆయన చిత్రాలు పరిశీలించేటప్పుడు ఇళయరాజా అవార్డును స్వీకరించరు అని ఆ చిత్రాలను పక్కన పెడతాం. విచారణై చిత్రానికి జీవీ మంచి సంగీతాన్నే అందించారు.ఆయనకు జాతీయ అవార్డును ప్రకటించి యువ సంగీతదర్శకులను ప్రోత్సహించే వారమని గంగైఅమరన్ తన సోదరుడు ఇళయరాజాపై విరుచుకుపడ్డారంటూ మీడియాలో ప్రచారం హల్చల్ చేస్తోంది. -
ఇళయరాజా సోదరుడికి పార్టీ పదవి
తమిళనాడులో ఇటీవలి కాలంలో బీజేపీలో చేరిన పలువురు సినీ ప్రముఖులకు పార్టీ పదవులు ఇచ్చారు. వాళ్లలో ఇళయరాజా సోదరుడు, ప్రముఖ సంగీతకారుడు గంగై అమరన్‌ను కళల విభాగానికి ప్యాట్రన్‌గా నియమిచంగా, కేంద్ర మాజీ మంత్రి డి. నెపోలియన్‌కు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు. వచ్చే సంవత్సరం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నియామకాల విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ తెలిపారు. దర్శకుడు కస్తూరి రాజాకు రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక సభ్యత్వంతో పాటు కళల విభాగానికి ఉపాధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. ఆ విభాగానికి కార్యదర్శిగా నటి గాయత్రీ రఘురామ్ నియమితులయ్యారు. పార్టీ ప్రచార విభాగం ఉపాధ్యక్షురాలిగా నటి, నిర్మాత కుట్టి పద్మినిని నియమించారు. ఎన్నికల విభాగానికి అధ్యక్షుడిగా అన్నాడీఎంకే మాజీ ఎంపీ ఎస్.మలైసామిని నియమించారు. గత యూపీఏ ప్రభుత్వంలో మంత్రిపదవి నిర్వహించిన నెపోలియన్.. 2014 డిసెంబర్లో డీఎంకేను వీడి బీజేపీలో చేరారు. గంగై అమరన్ కూడా గత సంవత్సరమే పార్టీలో చేరారు. -
బీజేపీలోకి ప్రముఖ సంగీత దర్శకుడు
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ బీజేపీలో చేరబోతున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన చేరనున్నట్లు సమాచారం. తొలిసారి తమిళనాడు పర్యటనకు వస్తున్న అమిత్ షా ఓ బహిరంగ సభలో పాల్గొంటున్న సందర్భంగా గంగై అమరన్‌ను చేర్చుకోడానికి తమిళనాడు బీజేపీ శ్రేణులు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేసుకున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావుతోను, తమిళనాడు శాఖ అధ్యక్షుడు తమిళసై సౌందరరాజన్తోను ఇప్పటికే అమరన్ మాట్లాడారు. ఇక గంగై అమరన్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా శనివారం నాడు జరిగే కార్యక్రమంలో కమలనాథుల దళంలో చేరుతారని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. గంగై కేవలం సంగీతదర్శకుడే కాదు.. పాటల రచయిత, సినిమా నిర్మాతగా కూడా ఉన్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అందుకే ప్రముఖులను పార్టీలో చేర్చుకుని ఈసారి ఎంతోకొంత ప్రభావం చూపాలనుకుంటోంది.