
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అర్ధాంగి, హీరోయిన్ అనుష్కా శర్మ తల్లికాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా అనుష్క ఆమె కడుపులో ఉన్న శిశువు కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో సముద్ర తీరాన నిల్చుని ఉన్న ఆమె గర్భాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతున్నారు. ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. (చదవండి: త్వరలో ముగ్గురం కాబోతున్నాం)
"ఓ జీవిని సృష్టించడం కన్నా అద్భుతం ఇంకేముంటుంది? పైగా అది నీ చేతిలో లేనపుడు దీన్ని ఇంకేమని పిలుస్తారు?" అని రాసుకొచ్చారు. బిడ్డకు జన్మనిచ్చి అమ్మ అని పిలిపించుకోవడం కన్నా గొప్ప విషయం ఏముంటుందని ఆమె అమ్మ తనాన్ని ఫీలవుతున్నారు. ఈ ఫొటోకు విరాట్ స్పందిస్తూ "నా జీవితం అంతా ఒక్క ఫ్రేములో ఉంది" అని కామెంట్ చేశారు. 2017 డిసెంబర్ 11న ఇటలీలో విరాట్ కోహ్లి, అనుష్క ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరమే కానీ, వచ్చే ఏడాది జనవరిలో మేం ముగ్గురం కాబోతున్నామంటూ విరుష్క జంట ఈ శుభవార్తను ఆగస్టు 27న సోషల్ మీడియా చెవిన వేసింది. ఇదిలా వుంటే అనుష్క.. ప్రభాస్ సరసన "ఆదిపురుష్" చిత్రంలో సీతగా నటించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. (చదవండి: ఆదిపురుష్: సీతగా అనుష్క!)
Comments
Please login to add a commentAdd a comment