
అప్పట్లో సినిమా ఛాన్సుల కోసం విజయ్ సేతుపతి తెగ తిరిగాడు. ఇప్పుడు తమ సినిమాల్లో నటించాలని దర్శకులు అతడి చుట్టూ తిరుగుతున్నారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా డిఫరెంట్ పాత్రల్లో నటిస్తూ బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళ, హిందీల్లో నటిస్తూ 50 చిత్రాల మైలురాయిని టచ్ చేశాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్)
విజయ్ సేతుపతి హీరోగా నటించిన 'మహారాజా' సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మరోవైపు మిస్కిన్ దర్శకత్వంలో 'పిశాచి 2'లోనూ విజయ్ లీడ్ రోల్ చేశాడు. ఇది కూడా విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు మరోసారి విజయ్‌తో సినిమా చేయాలని మిస్కిన్ ప్లాన్ చేస్తున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ మొదలు కానుంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 ఎలిమినేషన్.. నయని పావని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment