Naga Chaitanya and Samantha Get Requests from Fans That They Will Acts in Movies - Sakshi
Sakshi News home page

ChaySam Divorce: నాగ చైతన్య-సమంతలకు అభిమానుల విజ్ఞప్తి, అదేంటంటే

Published Tue, Oct 5 2021 3:00 PM | Last Updated on Tue, Oct 5 2021 4:53 PM

Naga Chaitanya And Samntha Gets Requests From Fans That They Will Acts In Movie - Sakshi

టాలీవుడ్‌ రొమాంటిక్‌ కపుల్‌ సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. గత మూడు రోజులుగా ఎక్కడ చూసినా సమంత-నాగ చైతన్య విడాకుల వార్తే చర‍్చనీయాంశమైంది. అసలు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని చై-సామ్‌ ఫ్యాన్స్‌ ఊహించి ఉండరు. వీరి విడాకుల గురించిన వార్తలు వస్తున్న అవి రూమర్స్‌గానే మిగిలిపోతాయని అందరూ భావించారు.

చదవండి: సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనైన సమంత, పోస్ట్‌ వైరల్‌

కానీ ఆ వార్తలనే నిజం చేస్తూ తాము విడిపోతున్నామంటూ ప్రకటించి అందరికి షాక్‌ ఇచ్చారు. ఈ విషయం సామాన్య ప్రజలను, అభిమానులను మాత్రమే కాదు పరిశ్రమకు చెందిన వారిని సైతం బాధించింది. అంతేగాక తాము భార్యభర్తలుగానే విడిపోతున్నామని, మంచి స్నేహితులుగా ఉంటామని వారిద్దరూ తమ ట్వీట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అభినూలంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ‘హార్ట్‌ బ్రోకెన్‌, ఇది నిజం కాదని చెప్పండి. రియల్‌ లైఫ్‌లోనే కాదు రీల్‌ లైఫ్‌లో కూడా మీది హిట్‌ పెయిర్‌’ అంటూ కొంతమంది కామెంట్స్‌ చేయగా మరికొందరూ చై-సామ్‌కు ఓ విజ్ఞప్తి చేస్తున్నారట.

చదవండి: నెటిజన్ల ట్రోల్స్‌: చై-సామ్‌ విడాకులకు కారణం ఇతడేనా!?

‘ఇక మీదట మిమ్మల్ని రియల్‌ లైఫ్‌ కపుల్‌గా చూడలేము.. కనీసం సినిమాల్లో అయినా చూసే అవకాశం మరొకసారి ఇవ్వండి. మీరిద్దరూ జంటగా మరో సినిమా చేయాలి’ అని కోరుతున్నారట. కాగా, ‘మనం’ మూవీ సమయంలో ప్రేమలో పడిన సమంత-నాగ చైతన్య అప్పటి నుంచి సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం నడిపారు. ఆ తర్వాత కొద్ది రోజులకు పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఈ క్రమంలో అక్టోబర్‌ 6, 7 తేదీల్లో వరుసగా హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఆ తర్వాత కూడా ఇద్దరూ సినిమాల పరంగా బిజీ అయిపోయారు. ఈ క్రమంలో ఇటీవల చైతన్య నటించిన ‘లవ్‌స్టోరీ’ మూవీ ఇటీవల విడుదల కాగా, సమంత ‘శాకుంతలం’ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement