ఆ రూమర్స్‌పై స్పందించిన నాగచైతన్య.. అవన్నీ! | Naga Chaitanya Opens Up On Rumours Of Walking Out Of Theatre After Seeing Samantha's Kushi Trailer - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: 'ఖుషి' ట్రైలర్ వల్ల చైతూ థియేటర్ బయటకొచ్చేశాడా?

Published Mon, Aug 28 2023 6:17 PM | Last Updated on Mon, Aug 28 2023 6:25 PM

Naga Chaitanya Respond Kushi Trailer Rumours - Sakshi

టాలీవుడ్ కపుల్ నాగచైతన్య-సమంత విడాకులు తీసుకుని చాలా రోజులైపోయింది. ప్రస్తుతం లైఫ్, కెరీర్ పరంగా ఎవరికి వాళ్లు బిజీగా ఉన్నారు. సామ్ హీరోయిన్ గా నటించిన 'ఖుషి'.. సెప్టెంబరు 1న రిలీజ్ కానుంది. మరోవైపు చైతూ కొత్త సినిమా బిజీలో పడిపోయాడు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా వీళ్లిద్దరి గురించి ఓ రూమర్ తెగ వైరల్ అవుతుంది. తాజాగా దీనిపై స్వయంగా నాగచైతన్య కూడా క్లారిటీ ఇచ్చేశాడు. 

ఏం జరిగింది?
హీరో నాగచైతన్య.. కొత్తగా వచ్చిన సినిమాలని హైదరాబాద్‌లోనే అప్పుడప్పుడు థియేటర్‌కి వెళ్లి చూస్తుంటాడు. అలా ఈ మధ్య ఓ సినిమాకి వెళ్లగా, బ్రేక్ టైంలో 'ఖుషి' ట్రైలర్ ప్లే చేశారట. దీంతో అది చూడలేక.. థియేటర్ నుంచి నాగచైతన్య బయటకు వచ్చేశారని ఓ న్యూస్ వైరల్ అయింది. దీన్ని చాలామంది రాశారు కూడా.

(ఇదీ చదవండి: డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కొడుకు)

చైతు రియాక్షన్
ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడిన చైతూ.. ఈ రూమర్స్‌పై స్పందించారు. 'అవన్నీ చెత్త వార్తలు. వాటిలో ఏ మాత్రం నిజం లేదు. కొన్ని తెలుగు వెబ్‌సైట్స్ లో రూమర్స్ నా దృష్టికి వచ్చాయి. ఆ వార్తల్ని సరిచేయాల్సిందిగా ఇప్పటికే వాళ్లకు సూచించాం' అని నాగచైతన్య చెప్పుకొచ్చారు. దీంతో ఇది కాస్త ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైపోయింది.

'ఖుషి'పై అంచనాలు
చాన్నాళ్ల నుంచి సమంతకు సరైన హిట్ పడలేదు. దీంతో 'ఖుషి'పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. 'లైగర్'తో దెబ్బతిన్న విజయ్ దేవరకొండ కూడా ఈ మూవీపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ట్రైలర్, పాటలు అవీ చూస్తుంటే.. ఆడేలా కనిపిస్తుంది. మరి ఏ విషయమనేది సెప్టెంబరు 1న తెలిసిపోతుంది. 

(ఇదీ చదవండి: మనసు మార్చుకున్న చిరు.. ఇకపై కేవలం!?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement