Namrata Shirodkar Applauds Drive in COVID-19 Vaccination Centres In Bhopal And Mumbai - Sakshi
Sakshi News home page

వ్యాక్సినేషన్‌ కోసం ఇలా చేయండి.. రాష్ట్ర ప్రభుత్వాలకు నమ్రత విజ్ఞప్తి

Published Thu, May 6 2021 1:30 PM | Last Updated on Thu, May 6 2021 2:54 PM

Namrata Shirodkar Applauds Drive in Vaccination Centres In Bhopal And Mumbai - Sakshi

Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజుకి మూడు లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. కేసుల సంఖ్య పెరడంతో ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్‌ దొరకడం లేదు. కరోనా సోకి కొంతమంది మృతి చెందితే, ఆక్సిజన్‌ అందక మరికొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ని సైతం ప్రకటించాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేశాయి. ముందుగా 45 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం.. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి కూడా వ్యాక్సీన్‌ని అందిస్తుంది.

అయితే ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వృద్ధులకు, దివ్యాంగులకు చాలా కష్టంగా మారింది. వ్యాక్సిన్ కోసం సీనియర్ సిటిజన్లు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. అలా క్యూలో నిలుచుంటే కరోనా బారిన పడే ప్రమాదం ఉంది. అంతే కాకుండా ఎక్కువసేపు వాళ్ళు నిలుచో లేరు. ఈ నేపథ్యంలో ముంబై, భోపాల్‌ ప్రాంతాల్లో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు అధికారులు. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు ఉన్న చోటుకే వెళ్లి వ్యాక్సిన్‌ వేస్తున్నారు. కారులోనే, ఇతర వాహనాలలో ఉన్నా కూడా అక్కడే టీకా అందిస్తున్నారు.

తాజాగా ఈ విషయం గురించి టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు భార్య నమ్రత చెబుతూ.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసింది. ‘భోపాల్‌, ముంబైలోవ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతోంది. ఎంతో మంచి నిర్ణయమది. సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు కారులోనే వ్యాక్సిన్ వేస్తున్నారు. మిగతా రాష్ట్రాలు కూడా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కష్టకాలం నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం.. అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోండి అని నమత్ర కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement